అంతర్జాతీయ ఉద్యోగ కెరీర్ జాబితాలో టాప్-5 దక్కించుకున్న యూఏఈ
- August 08, 2017
దుబాయ్: అంతర్జాతీయ ఉద్యోగ కెరీర్‌కు అత్యంత అనువైన దేశాల జాబితాలో యూఏఈకి టాప్-5లో చోటుదక్కింది.సంపాదన, ప్రయోజనాల ప్యాకేజీల విషయంలో యూఏఈ దేశ కంపెనీలు బాగా అందిస్తున్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది.
విదేశాల్లో అత్యుత్తమ కెరీర్‌ను ఇచ్చే తొలి మూడు స్థానాల్లో స్విట్జర్లాండ్, జర్మనీ, స్వీడన్ ఉన్నాయి.హెచ్ఎస్బీసీ నిర్వహించిన వార్షిక సర్వే- 2015లో ఆరో స్థానంలో ఉన్న యూఏఈ తాజాగా తన స్థానాన్ని మెరుగుపరుచుకొని నాలుగో స్థానంలో నిలిచింది. ఈ సర్వే కోసం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 27 వేల మంది అభిప్రాయాలు సేకరించారు.
సొంత దేశంలో కంటే యూఏఈలో ఎక్కువగా సంపాదిస్తున్నట్టు మూడో వంతు మంది చెప్పారు. ఈ కోవలో స్విట్జర్లాండ్ (75 శాతం), ఖతార్ (66) ముందున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







