చైనాలోని జింజియాంగ్ ప్రాంతంలో భారీ భూకంపం: 13 మంది మృతి
- August 09, 2017
చైనాలోని జింజియాంగ్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. భూకంపలేఖనిపై దీని తీవ్రత 6.3గా నమోదైంది. చైనా సరిహద్దు దేశమైన కజకిస్థాన్‌లో కూడా భూప్రకంపనలు నమోదయ్యాయి. మంగళవారం రాత్రి సుచువాన్ ప్రాంతంలో 7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపంలో సుమారు 13 మందికి మృతి చెందినట్లు భావిస్తున్నారు. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 30 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చైనా మీడియా వర్గాలు వెల్లడించాయి. ప్రకృతి అందాల్లో బందీలుగా వందలమంది..
ప్రకృతి అందాలకు సిచువాన్ ప్రావిన్స్ ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వివిధ వర్ణాల్లో కనువిందు చేసే సరస్సు అందాలను వీక్షించేందుకు ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు తరలి వస్తుంటారు. భూకంపం సంభవించినప్పుడు ఈ ప్రాంతంలో 38,000 మంది పర్యాటకులు ఉన్నట్లు సమాచారం.
మరోపక్క విద్యుత్ లేకపోవడంతో ఆ ప్రాంతమంతా చీకటిగా మారిందని ప్రత్యక్షసాక్ష్యులు పేర్కొన్నారు. 600 మంది అగ్నిమాపక సిబ్బంది, సైనికులు ఘటనాస్థలాలకు చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు చికిత్స నిమిత్తం తరలించారు. అదీకాకుండా ఇటీవల చైనాలో భారీ వర్షాలు కురిసి సిచువాన్ ప్రావిన్స్‌లోని చెంగ్డూ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు.
2008లో ఇక్కడే 70,000 మంది బలి..
సిచువాన్ ప్రాంతంలో 2008లో 8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ విపత్తులో దాదాపు 70,000 మంది ప్రాణాలు కోల్పోయారు. చైనా చరిత్రలోనే అత్యంత విషాదకరమైన భూకంపాల్లో ఒకటిగా దీనిని భావిస్తారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







