దుబాయ్ లో రానున్న ఎగిరే టాక్సీల కొత్త ఫోటోలు వెల్లడి

- August 09, 2017 , by Maagulf
దుబాయ్ లో రానున్న ఎగిరే టాక్సీల కొత్త ఫోటోలు వెల్లడి


దుబాయ్: పురాణ కాలంలో ...పుష్పక విమానాలలో విహరించిన మాదిరిగా దుబాయ్ వాసులు ఇకపై  అటు నుంచి ఇటు...ఇటు నుంచి అటు స్థానికంగా ఆకాశంలో విహరించనున్నారు. ఈ ఏడాది చివరినాటికి ఆ కల నెరవేరనుంది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆటోమేటెడ్ ఏరియల్ టాక్సీలు (ఏ ఏ  టి ) తొలిసారిగా దుబాయిలో ప్రారంభం కానుంది .కానీ దుబాయ్ లో ఎగురనున్న టాక్సీలు మానవరహిత వైమానిక వాహనాలు ఏ విధంగా కనిపిస్తాయనేది ఒక ఆలోచన. పెద్ద నగరం  యొక్క ఆకాశ మార్గాన్ని  చూసే విధానాన్ని ఆటోమేటెడ్ ఏరియల్ టాక్సీలు (ఏ ఏ  టి ) ఎలా ప్రయాణికులను తరలించనుందో తొలుత దుబాయ్ మీడియా కార్యాలయం ఫోటోలతో ప్రజలకు చూపే యత్నం చేసింది. రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ( ఆర్టీఏ ) జర్మన్ సంస్థ వోలోకాప్టర్ తో  కలిసి పనిచేస్తోంది, ఇది స్వయంప్రతిపత్తిగల ఎయిర్ వాహనాలను ( రాబోయే ఐదు సంవత్సరాలలో ఆటోమేటెడ్ ఏరియల్ టాక్సీలు (ఏ ఏ  టి ) రెండు సీట్లతో  పరీక్ష విమానాలు మరియు భద్రతా తనిఖీలు నిర్వహించింది. అయితే రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ( ఆర్టీఏ )  మరియు దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (డి సి ఏ ఏ) కొత్త రవాణా వ్యవస్థ కోసం నియమాలు మరియు నిబంధనలపై చర్చించాయి. గాలిలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గమ్యం వైపు దూసుకుపోనున్నాయి. 30 నిమిషాల పాటు ఆకాశంలో విహరించే  గరిష్ట నిరంతర విమాన సమయాన్ని కలిగి ఉంటుంది. విద్యుత్తో శక్తిని కలిగి ఉంటుంది, ఆటోమేటెడ్ ఏరియల్ టాక్సీలు (ఏ ఏ  టి ) 18 రోటర్లను కలిగి ఉంటుంది మరియు తొమ్మిది స్వతంత్ర బ్యాటరీ వ్యవస్థలు  కల్గి ఉంది 40 నిమిషాల్లో అవి ఛార్జింగ్ చేయబడతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com