స్టఫ్డ్ టమోటా

- August 09, 2017 , by Maagulf
స్టఫ్డ్ టమోటా

కావలసిన పదార్థాలు: పెద్దసైజు టమోటాలు- ఐదు, క్యారెట్‌ తురుము, తరిగిన క్యాప్సికమ్‌- అర కప్పు చొప్పున, పసుపు- పావు టీ స్పూను, కారం- ఒక టీ స్పూను, ధనియాల పొడి- ఒక టీ స్పూను, గరం మసాలా- ఒక టీ స్పూను, కొత్తిమీర- ఒక కట్ట, నూనె- ఒక టేబుల్‌ స్పూను, ఉప్పు- తగినంత.
తయారీ విధానం: బాణలిలో నూనె పోసి వేడెక్కాక టమోటాలు, కొత్తిమీర మినహా మిగిలిన పదార్థాలన్నిటినీ వేసి 5 నిమిషాలు వేగించి పక్కన పెట్టుకోవాలి. టమోటాలను పైభాగంలో కత్తిరించి లోపల గుజ్జు, విత్తనాలు తీసేసి వేగించి పెట్టుకున్న కూరను పెట్టాలి. తర్వాత పెనం మీద రెండు టీ స్పూన్ల నూనె వేసి వేడెక్కాక ఈ స్టఫ్డ్‌ టమోటాలను కూర బయటికి రాకుండా జాగ్రత్తగా అమర్చి మూత పెట్టి ఉడికించాలి. చివరగా కొత్తమీర వేసి దించేయాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com