నెయ్యితో లాభాలెన్నో...
- August 10, 2017
నెయ్యి కేవలం తినడానికే కాదు ముఖ సౌందర్యానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. పొడి చర్మం ఉన్నవాళ్లకి నెయ్యు మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. నెయ్యి వల్ల కలిగే మరికొన్ని లాభాలు మీకోసం..
ప్రతి రోజూ స్నానానికి ముందు రెండు చుక్కల నెయ్యితో ముఖాన్ని మసాజ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ముఖం ఫేషియల్ చేసుకున్నట్టుగా మెరిసిపోతుంది.
పొడిగా ఉండే పెదాలకు ప్రతిరోజూ లిప్‌బామ్ రాసుకోవల్సి ఉంటుంది. కానీ ప్రతిరోజూ పడుకునే ముందు పెదాలకు నెయ్యి రాసుకోవడం వల్ల అవి చాలా మృదువుగా తయారవుతాయి. దాంతో లిప్‌బామ్ అవసరమే ఉండదు.
కొంచెం నెయ్యిని గోరువెచ్చగా వేడిచేసి చిట్లిన జుట్టుకు రాసుకోవాలి. ఓ గంట తరువాత కడగాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకల్లో పగుళ్లు పోయి జుట్టు ఆరోగ్యంగా తయారవుతుంది.
నిద్ర సరిపోకపోవడం వల్ల కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడతాయి. పడుకునే ముందు కళ్లచుట్టూ ఉండే భాగాన్ని నెయ్యితో మసాజ్ చేసుకోవాలి. పొద్దున్నే లేచిన తరువాత ముఖం కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు చాలా త్వరగా పోతాయి.
కళ్లకు వేసుకున్న మేక్పని చాలా జాగ్రత్తగా తీసివేయాలి. అందుకు నెయ్యి బాగా ఉపయోగపడుతుంది. కొద్దిగా దూది తీసుకొని నెయ్యిలో ముంచి కళ్లచుట్టూ ఉండే చర్మాన్ని తుడవాలి.
నెయ్యి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. స్నానం చేయడానికి ముందు కొంచెం నెయ్యి తీసుకొని చర్మాన్ని మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా తయారవుతుంది. తరువాత మాయిశ్చరైజర్ రాసుకోవలసిన అవసరం ఉండదు.
కొంచెం శెనగ పిండిలో కొన్ని చుక్కలు నెయ్యి, పాలు పోసి కలిపిన మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. 15 నిమిషాల తరువాత కడుక్కోవాలి.
కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్‌కి కొన్నిచుక్కలు గోరువెచ్చని నెయ్యి కలపాలి. ఈ నూనెని మొదట మాడుకు మసాజ్ చేయాలి. తరువాత జుట్టుకు రాసుకోవాలి. పావుగంట తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల పొడిబారిన జుట్టును మృదువుగా, ఆరోగ్యవంతంగా చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్‌లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..







