టెర్రరిస్టులుతో సంబంధాలు వున్నాయని సౌదీ ఆరోపణలను ఖండించిన ఇరాన్
- August 10, 2017
తాలిబాన్ తీవ్రవాదులతో, ఆఫ్ఘనిస్తాన్‌లోని సాయుధ గ్రూపులతో ఇరాన్‌కు సంబంధాలు వున్నాయని సౌదీ దౌత్యవేత్త చేసిన ఆరోపణలను కాబూల్ లోని ఇరాన్ ఎంబసీ కార్యాలయం తీవ్రంగా ఖండించింది. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలని పేర్కొంది. సౌదీ దౌత్యవేత్త మిషారి అల్ హర్బి చేసిన విచ్ఛిన్నకర మైన ఈ వ్యాఖ్యలకు ఎలాంటి ప్రాతిపదిక లేదని, వాటిని తాము నిర్ద్వంద్వంగా ఖండిస్తు న్నామని ఒక ప్రకటనలో పేర్కొంది. ఆఫ్ఘనిస్తాన్‌లో తీవ్రవాదానికి, హింసాకాండకు తమ దౌత్యవేత్తలే బాధితులుగా మారుతున్నారని ఆ ప్రకటన తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతి, సుస్థిరతలకు మద్దతివ్వడమే తమ ప్రధాన విధానమని ఇరాన్ ఇప్పటికే స్పష్టం చేసిందని పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్‌మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్‌లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









