మామిడి చికెన్‌

- August 10, 2017 , by Maagulf
మామిడి చికెన్‌

కావలసిన పదార్థాలు: చికెన్‌ 1 కెజి, పచ్చి మామిడి పావు కిలో, అల్లం పేస్టు 1 టీ స్పూను, వెల్లుల్లి పేస్టు 1 టీ స్పూను, నువ్వుల నూనె 100 మిల్లీ గ్రాములు, దాల్చిన చెక్క, లవంగాలు 4 లేక 5, మామిడల్లం ముక్క, ధనియాల పొడి 1 టీ స్పూను, కారం 1 టీ స్పూను, గిలక్కొట్టిన పెరుగు 1 టీ స్పూను, వేగించిన ఉల్లిపాయలు 2 టీ స్పూన్లు, పచ్చిమిర్చి కొన్ని, మెంతి పొడి 1 టీ స్పూను, గరం మసాల పౌడరు 1 టీ స్పూను, క్రీము 1 టీ స్పూను, తగినంత ఉప్పు, 30 గ్రాముల కొత్తిమీర, 60 గ్రాముల గసగసాలు.
తయారుచేసే విధానం: చికెన్‌ని అంగుళం ముక్కలుగా కట్‌ చేసుకుని కడిగి నీళ్లు లేకుండా చేసుకోవాలి. మామి డల్లాన్ని, పచ్చిమిర్చిని సన్నని ముక్కలుగా తరుక్కోవాలి. మామిడికాయల్ని టెంక తీసి, సన్నగా కోరుకోవాలి. కొత్తిమీరను సన్నగా తరుక్కోవాలి. అల్లం, వెల్లుల్లి పేస్టులను ఒక కప్పు నీటిలో కలపాలి. గసగసాల్ని పేస్టులా చేసుకోవాలి.
పొయ్యి పైౖన దళసరి మూకుడు పెట్టి, నువ్వుల నూనె వేసి వేడెక్కాక దాల్చినచెక్కను, లవంగాలను వేసి వేగించి, కరిగించిన అల్లం, వెల్లుల్ని పేస్టులను కూడా వేసి నూనె పైకి తేలేదాకా వేగించాలి. తర్వాత కారంపొడిని, ధనియాల పొడిని వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత పెరుగు వేయాలి. కాసేపయ్యాక చికెన్‌ను వేసి రెండు నిమిషాలు సన్నని సెగపై ఉంచి ఉప్పు వేయండి. మంట పెంచి చికెన్‌ సగం ఉడకగానే మామిడి కోరు, వేగించిన ఉల్లిముక్కలు, గసగసాల పేస్టు వేసి సన్నని సెగపైన ఉడికించండి. చికెన్‌ దించేముందు మెంతిపొడిని, చీరిన పచ్చిమిర్చిని, గరం మసాల పొడిని, క్రీమ్‌ను, కొత్తిమీరను వేసి కలపాలి. దీన్ని వేడి వేడి పలావుతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com