దుబాయ్: ఆకాశంలో అద్భుతం ఈ వారాంతంలోనే
- August 10, 2017
ఈ వారాంతంలో దుబాయ్ వాసులు తమ కళ్ళన్నీ అర్థరాత్రి వేళ ఆకాశం వైపుకు తిప్పి చూస్తే, అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఆకాశం నుంచి తారలు నేలరాలుతున్న అనుభూతిని పొందవచ్చునని నిపుణులు పేర్కొంటున్నారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు రాత్రి వేళల్లో ఈ అద్భుతం సాక్షాత్కరిస్తుంది. ఆకాశం నుంచి జాలువారే ఉల్కలు, అవి పెద్ద సంఖ్యలో ఉండటంతో జరిగే ఉల్కాపాతం చూస్తే ఆకాశంలో సహజమైన ఫైర్ వర్క్స్‌లా కన్పిస్తాయి. అయితే ఇవి భూమికి ఎలాంటి హానీ చెయ్యవు. భూ వాతావరణంలోకి ఉల్కలు ప్రవేశించడంతోనే పూర్తిగా మండిపోతాయి. ప్రతి ఏడాదీ జులై 17 నుంచి ఆగస్ట్ 24 మధ్యలో ఈ ఉల్కాపాతం కన్పిస్తుంటుంది. దుబాయ్ ఆస్ట్రోనమీ గ్రూప్, ఆగస్ట్ 11న అల్ తురాయా ఆస్ట్రోనమీ సెంటర్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. అలాగే షౌకా డామ్ - రస్ అల్ ఖైమాలో ఆగస్ట్ 12న కూడా ఇదే తరహా కార్యక్రమం చేపడ్తోంది. అంతరిక్ష అద్భుతాలపై ఈ కార్యక్రమంలో అవగాహన కల్పిస్తారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







