6 నెలల్లో 12 మిలియన్ ప్రయాణీకులకు కస్టమ్స్ క్లియరెన్స్
- August 10, 2017
దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఆరు నెలల్లోనే మొత్తం 12 మిలియన్ మంది ప్రయాణీకుల్ని కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ క్లియరెన్స్ చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇది కాకుండా 18 మిలియన్ లగేజ్ ఐటమ్స్‌ని 39,000 విమానాల ద్వారా ఈ ఆరునెలల్లోనే ప్రాసెస్ చేసినట్లు తెలియవస్తోంది. ఈ కాలంలో 360 సీజ్‌లు, 6,500 కస్టమ్స్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. దుబాయ్ కస్టమ్స్ ప్యాసింజర్ ఆపరేషన్స్ డైరెక్టర్ ఇబ్రహీమ్ అల్ కమాలి మాట్లాడుతూ, దుబాయ్ ఎయిర్ పోర్ట్‌ల ద్వారా ప్రయాణం ప్రయాణీకులకు ఓ సరికొత్త అనుభూతినిస్తుందనీ, ఎలక్ట్రానిక్ గేట్స్ వంటి విధానాలతో ప్రయాణీకుల ఇబ్బందులు తగ్గాయని చెప్పారు. స్మార్ట్ ఇన్‌స్పెక్షన్ విధానం ద్వారా ఇన్‌స్పెక్షన్ సమయం 50 నుంచి 70 శాతం వరకు తగ్గిందని అన్నారాయన. యాత్రీకులకోసం మెరుగైన సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ప్రణాళికలతో ముందుకు వెళుతున్నట్లు తెలియజేశారు అల్ కమాలి.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







