డిస్ట్రెస్‌లో ఉన్న మెయిడ్‌ని రక్షించిన స్థానిక అధికారులు

- August 10, 2017 , by Maagulf
డిస్ట్రెస్‌లో ఉన్న మెయిడ్‌ని రక్షించిన స్థానిక అధికారులు

లోకల్‌ అథారిటీస్‌, డిస్ట్రెస్‌తో బాధపడుతున్న ఓ మహిళను రక్షించినట్లు అబుదాబీలోని ఇండియన్‌ ఎంబసీ వర్గాలు వెల్లడించాయి. హౌస్‌మెయిడ్‌గా పనిచేస్తోన్న ఓ మహిళ, తన యజమాని నుంచి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారనీ, ఈ విషయమై ఎంబసీ వద్ద ఫిర్యాదు చేసేందుకు రాగా చిన్నపాటి మిస్‌ కమ్యూనికేషన్‌తో ఆమె కాంటాక్ట్‌ తప్పిపోవడం జరిగిందని, ఈ నేపథ్యంలో ఆమెను లోకల్‌ అథారిటీస్‌ రక్షించాయని ఫస్ట్‌ సెక్రెటరీ, కౌన్సిలర్‌ ఫర్‌ కమ్యూనిటీ ఎఫైర్స్‌ - ఎంబసీ దినేష్‌కుమార్‌ చెప్పారు. యజమానితో తలెత్తిన సమస్య పట్ల చర్చలతోనే పరిష్కారం వెతకాల్సిందిగా ఎంబసీ అధికారులు ఆమెకి సూచించారనీ, అలా చెప్పడానికి కారణం ఆమె కేవలం రెండు నెలల క్రితమే ఆ పనిలో చేరారని కుమార్‌ వివరించారు. ఎంబసీ అధికారులు ఆమెకు ఓ ఫోన్‌ నెంబర్‌ ఇవ్వగా, ఆమె ఫోన్‌ చేసినప్పటికీ సరైన సమాచారం ఇవ్వకపోవడంతో ఎంబసీ అధికారులు సరైన సమయంలో స్పందించలేదని కుమార్‌ చెప్పారు. బాధితురాలికి సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామనీ, ఆమె కోరితే స్వదేశానికి పంపేందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని కుమార్‌ తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com