ఉద్యోగులు ఇకపై ఉద్యోగం మారితే.. పీఎఫ్ కూడా
- August 11, 2017
ఉద్యోగులకు శుభవార్త. ఇకపై ఉద్యోగం మారినప్పుడల్లా మీ భవిష్యనిధి ఖాతాను మార్చుకోవాల్సిన పనిలేదు. మరో ఉద్యోగానికి వెళ్లినప్పుడు పీఎఫ్ ఖాతా కూడా మారుతుందని భవిష్యనిధి ఖాతా కమిషనర్ వి.పి.జోయ్ తెలిపారు. ఖాతాదారుడు ఉద్యోగం మారినప్పుడల్లా పీఎఫ్ ఖాతాను మూసివేయాల్సి వస్తుందని, అలాంటి ఖాతాను నిర్వహించడం ప్రస్తుతం పెద్ద సవాలుగా మారిందని జోయ్ అన్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
'ప్రతి సారీ ఉద్యోగం మార్చినప్పుడల్లా ఉద్యోగులకు సంబంధించిన పీఎఫ్ ఖాతాలు మూసివేయాల్సి వస్తుంది. కొంతకాలం తర్వాత వారు తిరిగి కొత్త ఖాతాను తెరుచుకుంటున్నారు. కాని ఇప్పుడు ఆ అవసరం లేదు' అని జోయ్ అన్నారు. అంతేగాక, పీఎఫ్ ఖాతాకు ఆధార్‌ను తప్పనిసరి చేసినట్లు పేర్కొన్నారు. దీని ద్వారా దేశంలో ఎక్కడికైనా ఈ ఖాతాను బదిలీ చేసుకోవచ్చని, అది శాశ్వత ఖాతాగా ఉంటుందని వెల్లడించారు. ఉద్యోగం మారితే భవిష్యనిధి సొమ్మును మూడు రోజుల్లో బదిలీ చేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.
భవిష్యనిధి సొమ్మును ముఖ్యమైన అవసరాలకు తీసుకోవచ్చని.. దాని వల్ల ఉద్యోగికి సామాజిక భద్రత లభిస్తుందని పేర్కొన్నారు. ఈ విషయంపై ఉద్యోగులకు అవగాహన కల్పించనున్నట్లు జోయ్ తెలిపారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







