ఏపీఆర్టీసీలో వయో వృద్ధులకు 25 శాతం రాయితీ
- August 11, 2017
ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో వయో వృద్ధులకు ప్రయాణ ఛార్జీలో 25శాతం రాయితీ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఏసీ బస్సుల్లోనూ ఈ రాయితీ వర్తిస్తుందని స్పష్టంగా పేర్కొంది. కొత్త బస్సుల కొనుగోలు కోసం ఆర్టీసీకి ప్రభుత్వం రూ.117.90 కోట్లు విడుదల చేసింది.
ఉద్యోగులకు డీఏ పెంపు ఉత్తర్వులు.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం పెంచుతూ ఏపీ సర్కారు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. జులై ఒకటి నుంచీ బేసిక్ పేలో 18.34శాతం ఉన్న డీఏను 22.08 శాతానికి పెంచుతూ ఆదేశాలిచ్చింది. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డీఏ పెంపు అంశంపై ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. జులై 2016 నుంచి 31 ఆగస్టు 2017 వరకు ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ బకాయిలను వారి జనరల్ ప్రావిడెంట్ ఫండ్‌లో జమచేయాలని ఆదేశించింది. అలాగే కంట్రిబ్యూటరీ పింఛను పథకం కింద నియమితులైన ప్రభుత్వ ఉద్యోగుల డీఏ బకాయిల్లో పది శాతం వారి ప్రాన్ ఖాతాలో జమచేయాలని, మిగిలిన 90శాతం అక్టోబరు 2017 నెలలో వారికి నగదు రూపంలో చెల్లించాలని ఖజానా శాఖను ఆదేశించింది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







