పాక్‌ స్వాతంత్ర్య వేడుకలకు అతిథి ఎవరో తెలుసా!

- August 13, 2017 , by Maagulf
పాక్‌ స్వాతంత్ర్య వేడుకలకు అతిథి ఎవరో తెలుసా!

ఇస్లామాబాద్‌: భారత స్వాతంత్ర్యదినోత్సవానికి ఒక్కరోజు ముందు జరిగే పాకిస్తాన్‌ ఇండిపెండెన్స్‌డే సెలబ్రేషన్స్‌కు ఈఏడాది ఊహించిన అతిథి హాజరుకానున్నారు. అవును.. ఆ అతిథి.. చైనా ఉన్నత నాయకుడే!

చైనీస్‌ ప్రెసిడెంట్‌ జిన్‌పింగ్‌ సూచనమేరకు ఆ దేశ ఉపప్రధాని వాంగ్‌యాంగ్‌ సోమవారం(ఆగస్టు 14న) జరగనున్న పాక్‌ 70వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగే వేడుకలో ప్రధాని షాహిద్‌ అబ్బాసీతోకలిసి వాంగ్‌ పాల్గొంటారని పాక్‌ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గడిచిన కొన్నేళ్లుగా ఆర్థిక, రక్షణరంగాల్లో సహకారం అందిస్తూ చైనా.. పాకిస్తాన్‌కు ఆప్తమిత్రురాలిగా మారడం, అంతర్జాతీయ వేదికలపై పాక్‌కు వ్యతిరేకంగా ఉండే ఎలాంటి నిర్ణయాలనైనా చైనా వీటో చేస్తున్న తెలిసిందే.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com