అనారోగ్యంతో భాదపడుతున్న బాలిక అభ్యర్ధనకు స్పందించిన సౌదీ క్రౌన్ ప్రిన్స్
- August 14, 2017
మనామా: ఎంతైనా మనసున్న మహారాజుల తీరే వేరని ఈ కధనం రుజువు చేస్తుంది. వైద్యం కోసం అమెరికాకు వెళ్లిన ఓ బాలిక అభ్యర్థనను మన్నించి తన దయాగుణాన్ని తెలియచేశారా సౌదీ యువరాజు . సౌదీ అరేబియా నుంచి అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలోని ఓ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న ఆ బాలిక తన ఆవేదనను వ్యక్తం చేస్తుండగా తీసిని వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. నిన్న నా కాలుకు ఆపరేషన్ జరిగింది. ఇలాంటి సమయంలో మా అమ్మ నా పక్కన ఉంటే బాగుంటుంది. నాన్న, తాతయ్య ఇక్కడ ఉన్నా.. నాకు అమ్మను చూడాలని ఉంది. అమ్మ నాకు అన్నం తినిపిస్తోంటే నా కాలి నొప్పిని మర్చిపోగలననిపిస్తోంది.. ప్లీజ్ దయచేసి నాకు సహాయం చేయండి. సౌదీ రాజు సల్మాన్ గారూ.. మిమ్మల్ని దేవుడు చల్లగా చూస్తాడు.. నేనే మీ కుమార్తె లాంటిదాన్ని. ఈ చిన్న కుమార్తె కోరికను తీర్చలేరా..?’.. అంటూ విలపిస్తూ సౌదీ ప్రభుత్వాన్ని హలా అల్ ఎంజీ అనే పాప వేడుకుంది. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా తల్లి లేకుండానే పాప వైద్యానికి ఆ కుటుంబం సిద్ధపడింది. పాప తండ్రి, తాతయ్య మాత్రమే ఆమెతోపాటు అమెరికాకు వెళ్లారు. పాప విన్నపాన్ని ఆన్లైన్లో వైరల్ వీడియో ద్వారా చూసిన సౌదీ క్రౌన్ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాప కోరికను తీర్చేందుకు సిద్ధమయ్యారు. ఆమె తల్లిని అమెరికాకు పంపేందుకు ఏర్పాట్లు చేయాలని, పాప వైద్యానికి అయే ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. సౌదీ యువరాజు తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆయనను దేశ ప్రజలు నెటిజన్లు ప్రశంసలతో అభినందిస్తున్నారు. చూసిన సౌదీ క్రౌన్ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాప కోరికను తీర్చేందుకు సిద్ధమయ్యారు. ఆమె తల్లిని అమెరికాకు పంపేందుకు ఏర్పాట్లు చేయాలని, పాప వైద్యానికి అయే ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. సౌదీ యువరాజు తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆయనను దేశ ప్రజలు నెటిజన్లు ప్రశంసలతో అభినందిస్తున్నారు.
తాజా వార్తలు
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్







