మూగబోనున్న ప్రపంచప్రఖ్యాత ‘బిగ్‌బెన్’
- August 14, 2017
ప్రపంచప్రఖ్యాత బిగ్ బెన్ గడియారం మరో వారం రోజుల్లో మూగబోనుంది. మరమ్మతుల కోసం ఈ గడియారాన్ని తాత్కాలికంగా ఆపేయనున్నారు. వచ్చే సోమవారం నుంచి బిగ్ బెన్ టిక్‌టిక్ ఆగనుంది. 157 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ గడియారం సాంకేతిక లోపంతో 2007లో నిలిచిపోయింది. అంతకుముందు 1983-1985 కాలంలో స్వల్ప మరమ్మత్తుల కోసం దీన్ని ఆపారు.
సెంట్రల్ లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ పార్లమెంట్ కాంప్లెక్స్‌లోని ఎలిజబెత్ టవర్‌పై ఈ గడియారం ఉంది. దాదాపు 13.7టన్నుల బరువైన బిగ్ బెన్ మరమ్మత్తుల అనంతరం 2021 నుంచి పని చేయటం ప్రారంభిస్తుంది. దీనికి అవసరమైన పరికరాలను మార్చటంతో పాటు టవర్‌కు లిఫ్ట్, గడియారానికి పక్కన టాయిలెట్, కిచెన్‌ను ఏర్పాటు చేయనున్నారు. అయితే, కొత్త సంవత్సరం తదితర ముఖ్యమైన సందర్భాల్లో మాత్రం బిగ్‌బెన్ గంటలు మోగిస్తుందని అధికారులు తెలిపారు.
లండన్ మొత్తమ్మీద ఎలిజబెత్ టవర్ వద్దనే అత్యధిక సంఖ్యలో జనం ఫొటోలు తీసుకుంటుంటారు. 1859లో ఇయాన్ వెస్ట్వర్త్ అనే నిపుణుడు ఈ గడియారాన్ని రూపొందించారు. నాలుగు ముఖాలు కలిగిన, అత్యంత కచ్చితమైన సమయం చూపించే ప్రపంచంలోనే అతి పెద్ద గడియారం ఇదే.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







