రెండు తెలుగు రాష్ట్రాలలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
- August 14, 2017
తెలుగు రాష్ట్రాలలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. కృష్ణాష్టమి సందర్భంగా విజయవాడలోని శ్రీకృష్ణ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. విజయవాడ గులాబీ తోటలోని శ్రీకృష్ణ దేవస్థానానికి భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు. విశాఖలోనూ ఆలయాలన్నీ శ్రీ కృష్ణనామస్మరణతో మార్మోగిపోయాయి. చిన్నారులు శ్రీకృష్ణుని వేషధారణలో అందరినీ ఆకట్టుకున్నారు. వందేళ్ల చరిత్ర ఉన్న జిల్లా పరిషత్ శ్రీకృష్ణ మందిరంలో కృష్ణాష్టమిని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
తిరుపతిలో శ్రీవారి పాదాల చెంత ఉన్న హరేకృష్ణ కమల మందిరంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నికృష్ణుల వేషధారణలోని పిల్లలు అందరినీ ఆకట్టుకున్నారు. కమల మందిరంలో మూడు రోజుల పాటు జరగనున్న వేడుకల్లో.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలక్కుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లూ చేశారు.
అనంతపురంలోని ఇస్కాన్ ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయానికి పోటెత్తిన పిల్లలు, పెద్దలు శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం 30 వేల భక్తులతో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఇస్కాన్ ప్రతినిధులు తెలిపారు.
హైదరాబాద్ అంబర్ పేటలోని ఎల్లెన్ కిండర్ గార్టెన్ స్కూల్‌లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలలో పాల్గొన్న చిన్నారులు రాధాకృష్ణులు, గోపికల వేషాలతో సందడి చేశారు. ఉట్టి కొట్టి, సాంప్రదాయ నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు. మన సంస్కృతిని పిల్లలకు తెలియజెప్పేందుకే ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ప్రిన్సిపాల్ తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







