పశ్చిమ ఆఫ్రికాలో రెస్టారెంట్‌పై ఉగ్ర దాడి
- August 15, 2017
- బుర్కినా ఫాసోలో 20 మంది మృతి
పశ్చిమ ఆఫ్రికా దేశమైన బుర్కినా ఫాసో రాజధాని ఓగాడొగులో ఒక రెస్టారెంట్‌పై తీవ్రవాదులు జరిపిన దాడిలో 20మంది మరణించారని, పలువురు గాయపడ్డారని ప్రభుత్వం తెలిపింది. సాయుధులైన దుండగులు రెస్టారెంట్ వెలుపల కూర్చున్న కస్టమర్లపై కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మరణించినవారిలో విదేశీయులు కూడా వున్నారని, అయితే వారు ఏ దేశస్తులనే విషయం ఇంకా తెలియరాలేదని ఒక ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది. ఈ దాడి అల్‌ఖైదా అనుబంధ సంస్థల పనే అయివుంటుందని అనుమానిస్తున్నారు. రెస్టారెంట్‌పై సాయుధులు దాడి చేయడంతో భద్రతా బలగాలు కూడా ఎదురు దాడి జరిపాయని, 11మందిని కాపాడగా, వారిలో ఒకరు ఆస్పత్రిలో మరణించాడని కమ్యూనికేషన్స్ మంత్రి రెమిస్ తెలిపారు. ఈ దాడిలో ఎంతమంది పాల్గొన్నారనేది తెలియలేదని చెప్పారు. దాడి చేసిన భవనంలో ఒక భాగానికే తీవ్రవాదులు పరిమితమయ్యారని, భద్రతా బలగాలు మొత్తంగా గాలింపు చర్యలు చేపట్టాయని మంత్రి తెలిపారు. కాగా, ఇద్దరు దుండగులను భద్రతా బలగాలు చంపివేశాయని, దాడి ముగిసినట్లేనని ప్రభుత్వం ప్రకటించింది. ఆదివారం రాత్రి 9గంటల సమయంలో ప్రారంభమైన ఈ దాడి సోమవారం తెల్లవారు జామున 5గంటలకు ముగిసిందని మంత్రి తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







