శివకార్తికేయన్ నటించిన వేలైక్కారన్ టీజర్ విడుదల
- August 15, 2017
అతి తక్కువ కాలంలో స్టార్‌డమ్ అందుకున్న నటుడు శివకార్తికేయన్. అదే విధంగా వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ యువ స్టార్‌నటుడు తాజాగా నటిస్తున్న చిత్రం వేలైక్కారన్. ఇందులో ఈయనతో తొలిసారిగా టాప్ హీరోయిన్ నయనతార జత కట్టారన్న విషయం తెలిసిందే. తనీఒరువన్ వంటి సెన్సేషనల్ చిత్రం తరువాత మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్న ఇందులో మలయాళ నటుడు ఫాహత్‌ఫాజిల్ విలన్‌గా నటిస్తుండటం విశేషం. ఇంకా ప్రకాశ్‌రాజ్, సూరి, తంబిరామయ్య, సతీష్ తదితర ప్రముఖ నటులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
24ఏఎం.స్టూడియో పతాకంపై ఆర్‌డీ.రాజా నిర్మిస్తున్న ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన రెండు పోస్టర్లు ఇప్పటికే విడుదలై మంచి స్పందనను పొందాయి. కాగా టీజర్‌ను చిత్ర యూనిట్ సోమవారం సాయంత్రం విడుదల చేశారు. ఒక మంచి సోషల్ అంశంతో వేలైక్కారన్ చిత్రాన్ని తెరెక్కిస్తున్నట్లు దర్శకుడు మోహాన్‌రాజా ఇప్పటికే తెలిపారు. అదే విధంగా రజనీమురుగన్, రెమో వంటి విజయవంతమైన చిత్రాల తరువాత శివకార్తికేయన్ నటించిన చిత్రం కావడంతో వేలైక్కారన్ చిత్రం కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 29న భారీ ఎత్తున విడుదల చేయడానికి నిర్మాత ఆర్‌డీ.రాజా సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి







