సమ్మర్ వర్క్ బ్యాన్: 80 సంస్థల ఉల్లంఘన
- August 16, 2017
మొత్తం 80 సంస్థలు సమ్మర్ వర్క్ బ్యాన్ నిబంధనను ఉల్లంఘించినట్లు అధికారులు వెల్లడించారు. జులై 1 నుంచి ఇప్పటిదాకా నమోదైన ఉల్లంఘనల సంఖ్య 80 అని లేబర్ మినిస్ట్రీ స్పష్టం చేసింది. ఉల్లంఘనులకు చట్ట ప్రకారం జరీమానాలు ఉంటాయని అధికారులు తెలిపారు. 80 సంస్థలకు చెందిన 150 మంది కార్మికులు బ్యాన్ పీరియడ్‌లో పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు ఎండ తీవ్రత కారణంగా బహిరంగ ప్రదేశాల్లో కార్మికులు పని చేయడం పట్ల బ్యాన్ విధించడం జరుగుతోంది. 2007 నుంచి ఈ బ్యాన్ అమల్లో ఉంది. 40 డిగ్రీల ఉష్ణోగ్రత నేపత్యంలో ఎండలో పనిచేసే కార్మికులు తీవ్రమైన ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే నిబంధనల్ని ఉల్లంఘించి పలు సంస్థలు కార్మికులతో బ్యాన్ చేసిన సమయాల్లోనూ పనిచేయించడం కనిపిస్తుంటుంది. ఇలాంటి సంస్థలపై ఎప్పటికప్పుడు దాడులను నిర్వహిస్తారు అధికారులు. ఒక్కో కార్మికుడికి 500 నుంచి 1000 బహ్రెయినీ దినార్స్ చొప్పున ఆయా సంస్థలు జరీమానా చెల్లించవలసి ఉంటుంది. మొత్తం 77,500 బహ్రెయినీ దినార్స్ ఆయా సంస్థల నుంచి జరీమానాలుగా రావొచ్చని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







