జెడ్డా హిస్టారిక్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం
- August 16, 2017
జెడ్డాలోని చారిత్రక సెంటర్‌లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం కారణంగా ఆరు భవనాలు కాలిపోయాయి. వీటిల్లో మూడు భవనాలు పూర్తిగా కూలిపోయాయి. అగ్ని ప్రమాదం నేపథ్యంలో 60 మందిని అక్కడి నుంచి ఖాళీ చేయించారు. అగ్ని ప్రమాదం సంభవించిన భవనాల పేర్లను అధికారులు వెల్లడించారు. అల్ ఖుమ్‌సాని, అల్ అష్‌మావి, అల్ అబ్దెల్ అల్ ఇందులో ఉన్నాయి. మిగతా భవనాల పేర్లు ఇంకా వెల్లడి కాలేదు. పన్నెండుకి పైగా ఫైర్ ఫైటింగ్ రెస్క్యూ టీమ్స్ సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేశాయి. నాలుగు అంతస్తుల భవనంలో సంభవించిన అగ్ని ప్రమాదం ఇంతటి ఘోర దుర్ఘటనకు కారణంగా ప్రాథమిక అంచనాకి వచ్చారు అధికారులు. అయితే ఈ ప్రమాదం కారణంగా ఎవరూ గాయపడ్డంగానీ, ప్రాణాలు కోల్పోవడం గానీ జరగకపోవడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. పవిత్ర మక్కా, మదీనాలకు వెళ్ళే ప్రధాన గేట్ వే ప్రాంతంలో ఈ హిస్టారిక్ సెంటర్ కొలువుదీరింది.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







