నైజీరియా మార్కెట్లో ఆత్మాహుతి దాడి 27 మంది మృతి

- August 17, 2017 , by Maagulf
నైజీరియా మార్కెట్లో ఆత్మాహుతి దాడి 27 మంది మృతి

- 27 మంది మృతి 
నైజీరియాలో శరణార్థుల శిబిరానికి దగ్గరలో ఉన్న మార్కెట్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 27 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. మైదుగురి ప్రాంతానికి సమీపంలో మూడు చోట్ల ఆత్మాహుతి దాడులు జరిగాయని అన్నారు. కాగా, ఈ ఘటనకు పాల్పడినట్టు ఏ ఉగ్రసంస్థ కూడా ప్రకటించుకోలేదు. బొకోహరామ్‌ ఉగ్రసంస్థకు చెందిన సభ్యులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com