పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫిల్మ్ కొత్త టైటిల్
- August 17, 2017
పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో క్రేజీ ప్రాజెక్ట్ రానుంది. అత్తారింటికి దారేది తర్వాత వీళ్లిద్దరి చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో అంచనాలు రెట్టింపయ్యాయి. ఇప్పటివరకు షూటింగ్ సైలెంట్‌గా జరిగిపోయిందికానీ హీరో లుక్, టైటిల్ ఎక్కడా రివీల్ కాలేదు. ఇందులో పవన్ ఇంజనీరింగ్ స్టూడెంట్‌గా కనిపిస్తుండడంతో 'ఇంజనీర్ బాబు' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారని అప్పట్లో ఓ రేంజ్లో ప్రచారం సాగింది.
ఫిల్మ్‌నగర్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రానికి 'రాజు వచ్చినాడో' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. త్వరలో రాజకీయాల్లోకి పవన్ ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో త్రివిక్రమ్ ఈ విధంగా ఆలోచించి ఉంటాడని అంటున్నారు అభిమానులు. ఇక పవన్ పక్కన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు. పవన్ 25వ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







