ఒమాన్ ఏర్పోర్ట్ ట్యాక్సీ డ్రైవర్ల కొత్త మీటర్ల వినియోగానికి నిరాకరణ
- October 23, 2015
కొత్త మీటర్ల వినియోగానికి ఒమాన్ ఏర్పోర్ట్ ట్యాక్సీ డ్రైవర్ల నిరాకరణ
ఏర్పోర్ట్ వద్ద తమ వ్యాపారంపై తమకు గుత్తాధిపత్యం కావాలని కోరుతూ, అక్కడి ఏర్పోర్ట్ ట్యాక్సీ డ్రైవ ర్లు కొత్త మీటర్ల వినియోగానికి నిరాకరిస్తున్నారు. ప్రస్తుతం ఏ వాహనాన్నైనా ఎవరైనా, ట్యాక్సీ గా వినియోగించగలుగుతున్నారని, అలాకాకుండా ఆరేంజ్ ట్యాక్సీ లను, ప్రవాసీయులు తమ స్వంత వాహనాలను ట్యాక్సీలుగా వినియోగించడాన్ని వెంటనే నిరోధించాలని అంతవరకూ కొత్త మీటర్లను అనుమతించబోమని, ట్యాక్సీ డ్రైవర్ల ప్రతినిధి - అబ్దుల్లా అల్ షిబ్లి డిమాండ్ చేశారు. ఇది ఇలా ఉండగా, ట్యాక్సీ డ్రైవర్ల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురైనప్పటికీ, ఈ నిర్ణ యం మస్కట్ మునిసిపాలిటీ వారిచే 2012 లో ఆమోదించబడిందని, మొదటి దశలో ఐర్పోర్టుల ట్యాక్సీ లకు మీటర్లు బిగించామని, క్రమంగా మస్కట్ లోని హోటెల్ మరియు రీసార్ట్ ట్యాక్సీలకు, అనంతరం అన్ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ట్యాక్సీ లకు వర్తింపజేస్తామని మునిసిపల్ కౌన్సిల్ మెంబర్ - సలీమ్ అల్ ఘమ్మారీ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







