చాకో కేక్‌

- August 18, 2017 , by Maagulf
చాకో కేక్‌

కావలసినవి: మైదా ఒకటిన్నర కప్పులు, వంట సోడా ఒకటిన్నర టీ స్పూన్‌, ఉప్పు పావు టీ స్పూను, గుడ్లు 2, చక్కెర ఒకటిన్నర కప్పులు, నూనె అర కప్పు, పెరుగు ఒకటిన్నర కప్పు, వెనీలా ఎసెన్స్‌ ఒక టీ స్పూను, కోకో పౌడర్‌ ఒక కప్పు, కుకింగ్‌ చాకొలేట్‌ తురుము 100 గ్రా.
ఎలా చేయాలి
ముందుగా ఒవెన్‌ను 200 డిగ్రీల సెంటిగ్రేడ్‌లో వేడి చేయాలి. మైదాలో వంటసోడా, ఉప్పు కలిపి జల్లించి పక్కన పెట్టుకోవాలి. గుడ్ల మిశ్రమంలో చక్కెరను వేసి ఐదు నిమిషాల పాటు గిలక్కొట్టాలి. ఈ మిశ్రమంలో నూనె కూడా పోసి మరి కొద్దిసేపు గిలక్కొట్టాలి. తర్వాత పెరుగు, వెనీలా ఎసెన్స్‌ను వేసి బాగా కలపాలి. తర్వాత మైదా మిశ్రమాన్ని, కోకో పౌడర్‌ను కూడా వేసి కలపాలి.
8 ్ఠ 8 సైజు గిన్నెలో నెయ్యి లేదా నూనె పూసి దానిలో కొద్దిగా మైదా పిండిని చల్లాలి. ఈ గిన్నెలో పై మిశ్రమాన్ని పోసి 180 డిగ్రీల సెంటీగ్రేడ్‌లో 40 నిమిషాల పాటు బేక్‌ చేయాలి. కేక్‌ కొద్దిగా వేడిగా ఉండగానే కుకింగ్‌ చాకొలేట్‌ని దాని పైన పోసి చెక్క గరిటతో సమానంగా ఉండేలా సర్దాలి. రంగురంగుల స్ర్పింక్లర్స్‌ను పైన అందంగా అలంకరించాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com