బహ్రైన్ లో వి.ఒ.ఐ. పి. సర్వీసులపై అదనపు రుసుము వసూలుకు వ్యతిరేకంగా హెచ్చరిక
- October 23, 2015
బహ్రైన్ లోని టెలికాం కంపెనీలు వినియోగదారుల నుండి వి.ఒ.ఐ. పి. (వాయిస్ ఓవర్ ఇంటెర్నెట్ ప్రోటోకాల్) వినియోగానిపై అదనపు రుసుమును వసూలు చేయడంపై టెలికమ్మ్యునికేషన్స్ రెగ్యులేటరీ ఆధారిటీ (తర ) హెచ్చరికలను జారీచేసింది. దేశంలోని మూడు టెలికాం సంస్థలు, స్కైప్ మరియు ఫేస్ టైమ్వంటి వాయిస్ ఓవర్ ఇంటెర్నెట్ ప్రోటోకాల్ సర్వీసులపై ఈ విధంగా అదనంగా వసూలు చేయడంపై నిరసనలు వ్యక్తమవడంతో అత్యవసర ఆంక్షలను విధించింది. ఈ విషయంపై తమ దర్యాప్తు మేరకు, ఆ సంస్థలు ఏ విధమైన లిఖిత పూర్వక అనుమతి లేకుండానే సేవల నియమా నిబంధనలను మార్చివేసి, లైసెన్స్ నియమ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారని వివరించారు. సదారు టెలికాం ఆపరేటర్లు తమ తప్పులను సరిదిద్దుకొనట్లైతే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తర ) డైరక్టర్ జనరల్ మొహమ్మద్ బుబాషైత్ హెచ్చరించారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







