దోహా నుండి జెడ్డా వరకు: 7 సౌదియా విమానాలు
- August 19, 2017
సౌదీ అరేబియన్ ఎయిర్‌లైన్స్ (సౌదియా), ఏడు బోయింగ్ 777-300 విమానాల్ని దోహా నుంచి జెడ్డాకి ఖతారీ యాత్రీకుల్ని తరలించేందుకు వినియోగించనుంది. ఆగస్ట్ 22 నుంచి 25 వరకు ఈ విమానాలు సేవలందిస్తాయి. తిరుగ ప్రయాణంలో సెప్టెంబర్ 5న ఈ విమానాలు అందుబాటులో ఉంటాయి. దమ్మమ్ లేదా అల్ అహ్సా ఎయిర్‌పోర్ట్స్ ద్వారా ప్రయాణించాలనుకునే ఖతారీ యాత్రీకుల్ని సౌదీ విమానాల ద్వారా తరలిస్తామని జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ - ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ మొహమ్మద్ అల్ ఒతైబి చెప్పారు. అవసరమైతే ప్రత్యేక విమానాల్ని సైతం యాత్రీకులు వినియోగించుకోవచ్చని తెలిపారాయన. రాయల్ ఆర్డర్‌లో భాగంగా యాత్రీకులకు సహాయ సహకారాలు అందించడానికి తాము పూర్తి సన్నద్ధంగా ఉన్నట్లు ఒతైబి వివరించారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









