విడుదలకు సిద్ధమవుతోన్న నదియా....దేవి
- August 19, 2017
ప్రముఖ నటి నదియా ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం తిరుక్కువరాధకాది. తమిళ్లంఓ పదిహేను కోట్ల రూపాయలను వసూలు చేసిన ఈ సినిమాను వైనవి సమర్పణలో సువర్ణ పిక్చర్స్ బేనర్‌పై తెలుగులో దేవి పేరుతో విడుదల చేస్తున్నారు. సువర్ణ నిర్మాత. డి.తులసిదాస్ దర్శకుడు. పగ, ప్రతీకార నేపథ్యంలో హారర్ జోనర్లో ఈ సినిమా రూపొందింది. '
ఈ సినిమా ప్రస్తుతం తెలుగులో అనువాద కార్యక్రమాలను పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమవ్ఞతోంది. దృశ్యం తర్వాత నదియా పోలీస్ పాత్రలో నటించిన చిత్రమిది. ఈ సినిమాలో నదియా పాత్రకు చాలా అద్భుతంగా ఉంటుంది. దర్శకుడు తులసీదాస్గారు సినిమాను ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించారు. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మా సువర్ణ తెలిపారు. నదియా, కోవై సరళ, ఇనియా, ఆర్తి, సంగీత, అర్చన తదితరులు నటించిన ఈ చిత్రానికి కథశ మనోజ్ ఆర్, సంగీతం: ఎం.జి.శ్రీకుమార్, ఎడిటర్: కె.శ్రీనివాస్, సినిమాటోగ్రఫి: సంజీవ్ శంకర్, నిర్మాత: సువర్ణ, దర్శకత్వం: తులసీదాస్.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







