అరుదైన పురస్కారం అందుకున్న కెసిఆర్

- August 19, 2017 , by Maagulf
అరుదైన పురస్కారం అందుకున్న కెసిఆర్

తెలంగాణ సీఎంకు అరుదైన గౌరవం లభించింది. 2017 ఏడాదికి గాను కేసీఆర్‌కు అగ్రికల్చర్ లీడర్ షిప్ అవార్డు ఇస్తున్నట్టు భారత ఆహార వ్యవసాయ మండలి ప్రకటించింది. సెప్టెంబర్‌ 5న ఢిల్లీలో ఈ పురస్కారాన్ని అందించనున్నట్టు ఒక ప్రకటన విడుదలచేసింది. రైతుల సంక్షేమం కోసం శ్రమిస్తూ, తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకెళ్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రతిష్టాత్మకమైన అగ్రికల్చర్ లీడర్ షిప్ -2017 అవార్డు వరించింది. పాలసీ లీడర్‌షిప్ కేటగిరీ కింద భారత ఆహార, వ్యవసాయ మండలి  కేసీఆర్‌కు ఈ అవార్డు అందించనుంది. 

అగ్రికల్చర్ లీడర్‌షిప్ -2017 అవార్డు కోసం సీఎం కేసీఆర్ పేరును ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ ఆధ్వర్యంలోని కమిటీ ప్రతిపాదించింది. సెప్టెంబర్ 5న రాత్రి  న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలస్‌లో అంతర్జాతీయ వ్యవసాయ నాయకత్వ సదస్సులో ముఖ్యమంత్రికి ఈ అవార్డు ప్రదానం చేయనున్నారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి కోసం కృషి చేసే వారికి ఇండియన్ ఫుడ్, అగ్రికల్చర్ కౌన్సిల్ 2008 నుంచి ఈ అవార్డు అందిస్తూ వస్తోంది. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తూ, ఆధునిక వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తూ, లక్షలాది మంది రైతుల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌ను సంస్థ ఈ ఏడాది పురస్కారం కోసం ఎంపిక చేసింది. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వ్యవసాయ రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన విధానాలు, పథకాల అమలుకు గుర్తింపుగా ఈ అవార్డు ఇస్తున్నట్టు భారత ఆహార, వ్యవసాయ మండలి ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com