అరుదైన పురస్కారం అందుకున్న కెసిఆర్
- August 19, 2017
తెలంగాణ సీఎంకు అరుదైన గౌరవం లభించింది. 2017 ఏడాదికి గాను కేసీఆర్‌కు అగ్రికల్చర్ లీడర్ షిప్ అవార్డు ఇస్తున్నట్టు భారత ఆహార వ్యవసాయ మండలి ప్రకటించింది. సెప్టెంబర్ 5న ఢిల్లీలో ఈ పురస్కారాన్ని అందించనున్నట్టు ఒక ప్రకటన విడుదలచేసింది. రైతుల సంక్షేమం కోసం శ్రమిస్తూ, తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకెళ్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రతిష్టాత్మకమైన అగ్రికల్చర్ లీడర్ షిప్ -2017 అవార్డు వరించింది. పాలసీ లీడర్షిప్ కేటగిరీ కింద భారత ఆహార, వ్యవసాయ మండలి కేసీఆర్‌కు ఈ అవార్డు అందించనుంది.
అగ్రికల్చర్ లీడర్షిప్ -2017 అవార్డు కోసం సీఎం కేసీఆర్ పేరును ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ ఆధ్వర్యంలోని కమిటీ ప్రతిపాదించింది. సెప్టెంబర్ 5న రాత్రి న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలస్‌లో అంతర్జాతీయ వ్యవసాయ నాయకత్వ సదస్సులో ముఖ్యమంత్రికి ఈ అవార్డు ప్రదానం చేయనున్నారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి కోసం కృషి చేసే వారికి ఇండియన్ ఫుడ్, అగ్రికల్చర్ కౌన్సిల్ 2008 నుంచి ఈ అవార్డు అందిస్తూ వస్తోంది. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తూ, ఆధునిక వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తూ, లక్షలాది మంది రైతుల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌ను సంస్థ ఈ ఏడాది పురస్కారం కోసం ఎంపిక చేసింది. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వ్యవసాయ రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన విధానాలు, పథకాల అమలుకు గుర్తింపుగా ఈ అవార్డు ఇస్తున్నట్టు భారత ఆహార, వ్యవసాయ మండలి ప్రకటించింది.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్‌మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్‌లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









