తాత తో సందడి చేసిన మనవడు
- August 20, 2017
బాలకృష్ణ తాజా సినిమా 'పైసా వసూల్', 101 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు.. కాగా ఈ సినిమాలో ఒక సాంగ్ షూటింగ్ ను హైదరాబాద్ లో చేస్తున్న సమయంలో తాతయ్య బాలయ్య తో పాటు మనవడు దేవాన్ష్ కూడా షూటింగ్ చూడడానికి వచ్చినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 1 న రిలీజ్ కానున్న పైసా వసూల్ సినిమా ప్రమోషన్ లో భాగంగా వర్కింగ్ స్టిల్స్ ని చిత్ర రిలీజ్ చేసింది. ఈ స్టిల్స్ లో బాలకృష్ణ తన మనవడు దేవాన్ష్ ఉన్న రెండు ఫోటోలు ఉన్నాయి. ఈ ఫొటోల్లో దేవాన్ష్ షూటింగ్ ను చూస్తూ.. ఆనందిస్తుంటే.. మనవడి చేష్టలను చూసి తాత బాలయ్య మురిసిపోతున్నట్లు ఉంది. ఈ ఫోటోలు ప్రసుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. కాగా ఓ వైపు బాలయ్య మనవడిని షూటింగ్ లకు తీసుకెళ్తూ.. సందడి చేస్తుంటే.. మరో వైపు మరో తాత చంద్రబాబు.. రాజకీయ ముఖ్య వేడుకలకు మనవడు దేవాన్ష్ తో సందడి చేస్తున్నారు.. ఇరువురు తాతలు రాజకీయ, సినీ ప్రపంచాన్ని బుల్లి దేవాన్ష్ కు పరిచయం చేస్తున్నట్లున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







