నేడు సెగయలో వంటల పోటీ కార్యక్రమం
- August 19, 2017
మనామ: రానున్న ఓనం ఉత్సవాల్లో భాగంగా 4 పిఎమ్ న్యూస్ బహ్రెయిన్ కేరళీయ సమాజం (బి.కె.కె.) మహిళల విభాగంతో కలిసి సెగయలో బికెఎస్ ఆడిటోరియంలో 'ఐ-కుక్ లైవ్' కుకరీ పోటీ నిర్వహిస్తారు. ఇరవై మంది పోటీదారులతో ఈ పోటీలు సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమవుతాయి. పాల్గొనే వారు శాఖాహార వంటకంతో పాటు మరొక ఒక తీపి వంటకం సిద్ధం చేయాలి. వారి వంటకు కావాల్సిన వివిధ పదార్థాలను నిర్వాహకులు అందచేస్తారు. బహ్రెయిన్ లోని ప్రతిష్టాత్మక హోటళ్ళకు చెందిన పాకశాస్ర్త ప్రవీణులు ఈ వంటల పోటీలకు న్యాయమూర్తులుగా ఉంటారు. విజేతలకు మరియు పాల్గొనే ప్రతి మహిళకు ఆకర్షణీయమైన బహుమతులను అందచేస్తారు.ఇతర వినోద కార్యక్రమములతో పాటు మరియు ప్రేక్షకులకు బహుమతులు కూడా ఉన్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధానంగా క్లిక్ ఆన్ , అల్ ఒస్రా గ్రూప్, వి ఏం బి ట్రేడర్స్, ముహమ్మద్ ఫాఖ్రో మరియు బ్రదర్స్ డబ్ల్యూ ఎల్ ఎల్, సరస్, సన్ఫోర్డ్, హాట్ ప్యాక్ మరియు గ్రీన్ వే ట్రేడింగ్ తదితర సంస్థలు స్పాన్సర్లుగా వ్యవహరించనున్నాయి. రిజిస్ట్రేషన్ మరియు మరిన్నిఇతర వివరాల కొరకు కో ఆర్డినేటర్ మోహిని థామస్ (39804019) లేదా షిజిత్ (38444687) సంప్రదించండి.
తాజా వార్తలు
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్







