మహానటి సావిత్రి కడదాకా శ్రీమంతురాలే
- August 20, 2017
మహానటి 'సావిత్రి' వెండి తెరపై సామ్రాజ్ఞిగా వెలుగొందింది.. కానీ జీవిత చరమాంకం లో డబ్బు అంతా పోగొట్టుకొని అత్యంత దీన స్థితిలో బతికింది అనే భావం జనం లో ఎక్కువగా ఉన్నది.. అనారోగ్యానికి చికిత్స చేయించుకోవడానికి కూడా ఆర్ధిక స్థితి సహకరించలేదని టాక్.. కానీ తన తల్లి ఆర్ధికంగా చితికి పోయి అత్యంత దారిద్ర్యం అనుభవించింది ... ప్రచారం అంతా అబద్ధమని సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి చెప్పింది. తమ అమ్మ ఏ విధమైన ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొలేదని.. ఆమె సంపాదించిన దానితోనే తాము ఇప్పటికీ సుఖంగా బతుకుతున్నామని చెప్పారు.. తన తల్లి ఎంత డబ్బు పోగొట్టుకొన్నా.. అంతకు రెట్టింపు సంపాదించారని.. తనకు తన సోదరుడికి చాలా డబ్బు అందజేశారని.. తాము ఇప్పటికీ ఎటువంటి ఆర్ధిక ఇబ్బందులు లేకుండా ఆర్ధికంగా ఉన్నత స్థితిలో బతుకుతున్నామంటే తమ తల్లి సావిత్రే కారణం అని చెప్పింది.. అంతేకాదు.. తన తల్లి ద్వారా సంక్రమించిన ఆస్తి మరో రెండు తరాలు గడిపినా తరగనంత ఉన్నదని చెప్పడం విశేషం.. కానీ ఒక దశ దాటాక సరైన పాత్రలు ఎంపిక చేసుకోకపోవడం..వల్ల తన తల్లి కెరీర్ దెబ్బతిన్నదని.. చెప్పింది.. కాగా మహానటి సినిమాలో అన్నీ నిజాలే చెబుతారని ఆశిస్తున్నట్లు చాముండేశ్వరి చెప్పారు.. తన తల్లి సావిత్రి గురించి భవిష్యత్ తరాలకు వాస్తవాలు తెలియజేసేలా మహానటి సినిమా తెరకెక్కిస్తున్నారు అని అనుకొంటున్నట్లు తెలిపారు..
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







