మహానటి సావిత్రి కడదాకా శ్రీమంతురాలే

- August 20, 2017 , by Maagulf
మహానటి సావిత్రి కడదాకా శ్రీమంతురాలే

మహానటి 'సావిత్రి' వెండి తెరపై సామ్రాజ్ఞిగా వెలుగొందింది.. కానీ జీవిత చరమాంకం లో డబ్బు అంతా పోగొట్టుకొని అత్యంత దీన స్థితిలో బతికింది అనే భావం జనం లో ఎక్కువగా ఉన్నది.. అనారోగ్యానికి చికిత్స చేయించుకోవడానికి కూడా ఆర్ధిక స్థితి సహకరించలేదని టాక్.. కానీ తన తల్లి ఆర్ధికంగా చితికి పోయి అత్యంత దారిద్ర్యం అనుభవించింది ...  ప్రచారం అంతా అబద్ధమని సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి చెప్పింది. తమ అమ్మ ఏ విధమైన ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొలేదని.. ఆమె సంపాదించిన దానితోనే తాము ఇప్పటికీ సుఖంగా బతుకుతున్నామని చెప్పారు.. తన తల్లి ఎంత డబ్బు పోగొట్టుకొన్నా.. అంతకు రెట్టింపు సంపాదించారని.. తనకు తన సోదరుడికి చాలా డబ్బు అందజేశారని.. తాము ఇప్పటికీ ఎటువంటి ఆర్ధిక ఇబ్బందులు లేకుండా ఆర్ధికంగా ఉన్నత స్థితిలో బతుకుతున్నామంటే తమ తల్లి సావిత్రే కారణం అని చెప్పింది.. అంతేకాదు.. తన తల్లి ద్వారా సంక్రమించిన ఆస్తి మరో రెండు తరాలు గడిపినా తరగనంత ఉన్నదని చెప్పడం విశేషం.. కానీ ఒక దశ దాటాక సరైన పాత్రలు ఎంపిక చేసుకోకపోవడం..వల్ల తన తల్లి కెరీర్ దెబ్బతిన్నదని.. చెప్పింది.. కాగా మహానటి సినిమాలో అన్నీ నిజాలే చెబుతారని ఆశిస్తున్నట్లు చాముండేశ్వరి చెప్పారు.. తన తల్లి సావిత్రి గురించి భవిష్యత్ తరాలకు వాస్తవాలు తెలియజేసేలా మహానటి సినిమా తెరకెక్కిస్తున్నారు అని అనుకొంటున్నట్లు తెలిపారు..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com