సోషల్ మీడియాను కొత్త ట్రెండ్ తో ఊపేయనున్న ఎన్టీఆర్
- August 20, 2017
జై లవ కుశ సినిమాను ప్రతీష్టాత్మకంగా తీసుకున్న ఎన్టీఆర్, ప్రమోషన్ పద్ధతుల్లోనూ సరికొత్త టెక్నాలజీలను ఆశ్రయిస్తున్నారు. నేనే రాజు నేనే మంత్రి సినిమా రానా కూడా ఓ కొత్త టెక్నాలజీని పరిచయం చేశాడు. అదే బాటలో ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ఓ కొత్త పంథాను పరిచయం చేస్తున్నాడు. ఇటీవల ట్యూబ్ లైట్ సినిమా రిలీజ్ సందర్భంగా సల్మాన్ ఖాన్ తన ఫోటోనే ఎమోజీగా సోషల్ మీడియాలో రిలీజ్ చేసి సరికొత్త ట్రెండ్ కు నాంధి పలికాడు.
తాజాగా సౌత్ స్టార్ విజయ్ తన కొత్త మెర్సల్ (తెలుగులో అదిరింది) స్టిల్ ను కూడా ఎమోజీగా రిలీజ్ చేసి ఆకట్టుకున్నాడు. ఎన్టీఆర్ కూడా ఇదే బాటలో నడిచేందుకు రెడీ అవుతున్నాడు. జై లవ కుశ సినిమాలోని మూడు క్యారెక్టర్లకు సంబంధించిన మూడు ఎమోట్ ఐకాన్స్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఇలా ప్రత్యేక ఎమోట్ ఐకాన్స్ ను రిలీజ్ చేసేందుకు ట్విట్టర్ సంస్థ గట్టిగానే చార్జ్ చేస్తుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే టాలీవుడ్ లో తరహా ప్రచారాన్ని ప్రారంభించిన తొలి నటుడిగా ఎన్టీఆర్ రికార్డ్ సృష్టించబోతున్నాడు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







