బాలకృష్ణ సినిమాలో రీ ఎంట్రీకి సిద్ధంగా ఉన్న నయనతార

- August 22, 2017 , by Maagulf
బాలకృష్ణ సినిమాలో రీ ఎంట్రీకి సిద్ధంగా ఉన్న నయనతార

బాలకృష్ణ, నయనతార కాంబినేషన్‌కు మంచి పేరుంది. లోగడ వారిద్దరూ నటించిన సింహా, శ్రీరామరాజ్యం చిత్రాలు విజయం సాధించడంతో హిట్‌ పెయిర్‌గా వారికి మంచి క్రేజ్‌ లభించింది. పైసా వసూల్‌ చిత్రం విడుదలకు మునుపే బాలకృష్ణ తన 102వ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకుని వచ్చారు. ముచ్చటగా మూడోసారి బాలకృష్ణ నయనతార ఈ చిత్రంలో నటిస్తోంది. కాగా ఇటీవలే ప్రారంభమైన ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌ చిత్రీకరణ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సి.కల్యాణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు యాక్షన్‌ సీక్వెన్స్‌లను కూడా ఫిలింసిటీలో చిత్రీకరిస్తున్నారు. సోమవారం నుంచి ఈ చిత్రం షూటింగ్‌లో నయనతార పాల్గొంటోంది. లోగడ బాలకృష్ణ, నయనతారలు నటించిన సినిమాల స్థాయిలోనే వారి మధ్య కెమెస్ట్రీ ఇందులో ఉండనుందని నిర్మాత సి.కల్యాణ్‌ తెలిపారు. బాలకృష్ణ కెరీర్‌లోనే ఇదో సంచలన చిత్రమవుతుందని ఆయన చెప్పారు. 
ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో బ్రహ్మానందం, ప్రకాష్‌రాజ్‌, అశుతోష్‌రాణా, మురళీమోహన్‌, బాహుబలి ప్రభాకర్‌, శివపార్వతి తదితరులు తారాగణం. ఈ చిత్రానికి కథ, మాటలు: ఎం.రత్నం, కెమెరా: సి.రాంప్రసాద్‌, సంగీతం: చిరంతన్‌భట్‌, సహ నిర్మాత: సి.వి.రావు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: సి.తేజ, సి.వరుణ్‌కుమార్‌, నిర్మాత: సి.కల్యాణ్‌, దర్శకత్వం: కె.ఎస్‌.రవికుమార్‌. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com