హైదరాబాద్ మసాజ్ సెంటర్లోడ్రగ్స్, సినీ లింకులు
- August 22, 2017
హైదరాబాద్ మసాజ్ దందాకు హైదరాబాద్‌లో ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయి. ఇదేదో సినిమా డైలాగ్ కాదు. పచ్చి నిజం. డ్రగ్స్ కోసం ఏ గోవాకో వెళ్లనక్కరలేదు. వాట్సప్ చేస్తే చాలు వచ్చేస్తోంది. మసాజ్‌ల కోసం ఏ థాయ్‌లాండో, మకావూ వెళ్లాల్సిన పనిలేదు. నగరంలోని "స్పా" కు వెళ్లితే కావలసినంత సుఖం దొరకుతోంది. పోలీసులు వరుస దాడులతో సిటీలోని మసాజ్ సెంటర్ల భరతం పడుతున్నారు. పదుల సంఖ్యలో థాయ్‌లాండ్ అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. పలువురు నిర్వాహకులను అరెస్ట్ చేయగా.. విచారణలో వారు అనేక సంచలన విషయాలు బయటపెడుతున్నట్టు తెలుస్తోంది. మసాజ్ మాటున వ్యభిచారంతో పాటు డ్రగ్స్ సరఫరా, సినీ లింకులు కూడా ఉన్నట్టు వెల్లడించారు. ఈ దందాలో పండిపోయిన సిద్దార్థ్ నుంచి.. థాయ్ యువతులను ఎలా తీసుకొచ్చింది.. అతని కస్టమర్లు ఎవరు? డ్రగ్స్ వాడకం.. తదితర అంశాలపై పూర్తి వివరాలు రాబట్టినట్టు సమాచారం.
మసాజ్‌కు వచ్చిన సెలబ్రిటీలు, వీవీఐపీలు.. మజా కోసం మత్తును కోరుకునే వారట. అందుకే.. స్పెషలైజ్డ్ కస్టమర్ల కోసం కొకైన్ తదితర డ్రగ్స్ తెప్పించేవాడినని.. తానూ డ్రగ్స్ వాడేవాడినని సిద్దార్థ్ పోలీసులుకు చెప్పాడు. సిటీలోని డ్రగ్ ఫెడ్లర్స్‌తో పాటు గోవా తదితర ప్రాంతాల నుంచి మత్తు పదార్థాలు తెచ్చేవాడట. దీంతో.. డ్రగ్స్ లింకులపై మరింత లోతుగా విచారణ చేస్తున్నారు పోలీసులు.
మరోవైపు.. మసాజ్ పేరుతో జరిగే వ్యభిచారానికి గ్లామర్ టచ్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇద్దరు సినీ యాక్టర్లతో క్లోజ్‌గా ఉండే సిద్దార్థ్.. వారి సహకారంతో టాలీవుడ్‌తో పాటు బుల్లితెరకు చెందిన పలువురు ఆర్టిస్టులను సప్లై చేసేవాడట. గతంలో వ్యభిచార కేసులో అరెస్ట్ అయిన ఓ సినీ నటి.. ఈ స్పా బిజినెస్‌కు ఫుల్‌గా సహకరించినట్టు తెలుస్తోంది. సినిమాల్లో అవకాశాలు సరిగా లేని పలువురు యువతులు.. మసాజ్ దందా వైపు మొగ్గు చూపేవారని సిద్దార్థ్ వెల్లడించాడు.
స్పా బిజినెస్ బాగా సాగాలని.. ఎప్పటికప్పుడు అమ్మాయిలను మార్చేస్తుండే వాడట. థాయ్ అమ్మాయిలకు డిమాండ్ బాగా ఉండటంతో.. ఖర్చు ఎక్కువైనా.. నెలకు దాదాపు లక్ష జీతానికి అక్కడి వారిని తీసుకొచ్చేవాడు. మసాజ్ సెంటర్లలో ఉద్యోగమని చెప్పి వారిని ఇక్కడికి తీసుకొచ్చి.. ఆ తర్వాత వారితో వ్యభిచారం చేయించేవాడని తెలుస్తోంది. స్పాలతో భారీగా డబ్బు వచ్చి పడటంతో.. సిద్దార్థ్ లగ్జరీ లైఫ్ గడిపేవాడట. జల్సాల కోసమే నెలకోసారి గోవా ట్రిప్.. రెండు నెలలకోసారి ఫారిన్ టూర్ వేసేవాడు. ఇటు వ్యభిచారం.. అటు డ్రగ్స్ దందాతో హైదరాబాద్‌ను షేక్ చేసే స్థాయిలో ఇల్లీగల్ బిజినెస్ చేసిన సిద్దార్థ్ ఇచ్చిన సమాచారం మేరకు మరికొందరిని ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు పోలీసులు.డ్రగ్స్, సినీ లింకులు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







