బాలకృష్ణ సినిమాలో రీ ఎంట్రీకి సిద్ధంగా ఉన్న నయనతార
- August 22, 2017
బాలకృష్ణ, నయనతార కాంబినేషన్‌కు మంచి పేరుంది. లోగడ వారిద్దరూ నటించిన సింహా, శ్రీరామరాజ్యం చిత్రాలు విజయం సాధించడంతో హిట్ పెయిర్‌గా వారికి మంచి క్రేజ్ లభించింది. పైసా వసూల్ చిత్రం విడుదలకు మునుపే బాలకృష్ణ తన 102వ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకుని వచ్చారు. ముచ్చటగా మూడోసారి బాలకృష్ణ నయనతార ఈ చిత్రంలో నటిస్తోంది. కాగా ఇటీవలే ప్రారంభమైన ఈ చిత్రం మొదటి షెడ్యూల్ చిత్రీకరణ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సి.కల్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు యాక్షన్ సీక్వెన్స్‌లను కూడా ఫిలింసిటీలో చిత్రీకరిస్తున్నారు. సోమవారం నుంచి ఈ చిత్రం షూటింగ్లో నయనతార పాల్గొంటోంది. లోగడ బాలకృష్ణ, నయనతారలు నటించిన సినిమాల స్థాయిలోనే వారి మధ్య కెమెస్ట్రీ ఇందులో ఉండనుందని నిర్మాత సి.కల్యాణ్ తెలిపారు. బాలకృష్ణ కెరీర్లోనే ఇదో సంచలన చిత్రమవుతుందని ఆయన చెప్పారు.
ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో బ్రహ్మానందం, ప్రకాష్‌రాజ్, అశుతోష్‌రాణా, మురళీమోహన్, బాహుబలి ప్రభాకర్, శివపార్వతి తదితరులు తారాగణం. ఈ చిత్రానికి కథ, మాటలు: ఎం.రత్నం, కెమెరా: సి.రాంప్రసాద్, సంగీతం: చిరంతన్‌భట్, సహ నిర్మాత: సి.వి.రావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: సి.తేజ, సి.వరుణ్‌కుమార్, నిర్మాత: సి.కల్యాణ్, దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







