ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ మీడియా హక్కుల వేలం

- August 22, 2017 , by Maagulf
ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ మీడియా హక్కుల వేలం

 రేసులో 20 కంపెనీలు 
అత్యంత ప్రజాదరణ, పాపులర్‌ స్పోర్ట్స్‌ లీగ్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) మీడియా హక్కుల రేసులో సుమారు 20 దిగ్గజ కంపెనీలు పోటీపడుతున్నాయి. బిడ్‌ దాఖలు చేసేందుకు గడువు సెప్టెంబర్‌ 1 వరకూ ఉన్నప్పటికీ.. ఇప్పటికే ఇన్విటేషన్‌ టు టెండర్‌ (ఐటీటీ)ను 20 కంపెనీలు కొనుగోలు చేసినట్టు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఆగష్టు 28 తుది గడువే అయినా.. బ్యాంకులకు వరుస సెలవులతో డెడ్‌లైన్‌ను పొడగించారు. ఇక మీడియా హక్కుల వేలానికి ఈ వేలంలో బిడ్లు ఆహ్వానించాలని బీజేపీ నేత సుబ్రమణ్యిస్వామి సుప్రీం కోర్టులో పిటిషను దాఖలు చేశారు. దీంతో తదుపరి విచారణ సందర్భంగా బిడ్లను సుప్రీంకోర్టు ముందుం చనున్నారు. ఈ వేలం నిర్వహించడానికి ' క్రికెట్‌, బొగ్గు ఒకటి కాదు' అని బీసీసీఐ దీటుగా బదులిచ్చినా.. దీనిపై తదుపరి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా సారథ్యంలోని త్రి సభ్య ధర్మాసనం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. టెలివిజన్‌ మీడియా హక్కులకు తోడు డిజిటల్‌ మీడియా హక్కులు రానున్న కాలంలో ప్రధాన పాత్ర పోషించనున్నాయి. దీంతో డిజిటల్‌ మీడియా హక్కులు, టెలివిజన్‌ మీడియా హక్కుల కోసం బడా కంపెనీలు ఐపీఎల వేలంలో పోటీపడుతున్నాయి. 
ఇన్విటేషన్‌ టు టెండర్‌ కొనుగోలు చేసిన కంపెనీలు : స్టార్‌ ఇండియా ప్రై.లిమిటెడ్‌, సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌, అమెజాన్‌ సెల్లర్‌ సర్వీసెస్‌, రిలయన్స్‌ జియో డిజిటల్‌, యాహూ, ఫాలోవోన్‌ ఇంటరాక్టివ్‌ మీడియా, టైమ్స్‌ ఇంటర్నెట్‌ లిమిటెడ్‌, గల్ఫ్‌ డిటిహెచ్‌, సూపర్‌స్పోర్ట్‌ ఇంటర్నేషనల్‌, గ్రూప్‌ ఎం మీడియా ఇండియా, ఎకోనెట్‌ మీడియా గ్రూప్‌, స్కై యూకే, ఈఎస్‌పీఎన్‌ డిజిటల్‌ మీడియా, బిటీజీ లీగల్‌ సర్వీసెస్‌, బిటీ స్పోర్ట్‌, ట్వీట్టర్‌, ఫేస్‌బుక్‌, డిస్కవరి, ఎయిర్‌టెల్‌, డీఏజెడ్‌ఎన్‌ పర్‌ఫామ్‌ గ్రూప్‌.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com