నటి హీరోయిన్ ప్రియమణి పెళ్లి
- August 24, 2017
ప్రముఖ కథానాయిక ప్రియమణి పెళ్లి చేసుకొంది. ముంబయికి చెందిన పారిశ్రామికవేత్త ముస్తఫారాజ్తో ప్రియమణి వివాహం బుధవారం బెంగళూరు బనశంకరిలో జరిగింది. ప్రియమణి- ముస్తఫారాజ్ స్నేహితులు. గత ఏడాది వీరి నిశ్చితార్థం జరిగింది. తమ వివాహాన్ని రిజిస్టర్ చేసుకునేందుకు గత జులైలో జయనగర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. గురువారం జేపీనగరలో వివాహ విందు ఇవ్వబోతున్నట్టు ప్రియమణి కుటుంబ సభ్యులు వెల్లడించారు. తమ వివాహానికి అభిమానులను ఆహ్వానించలేకపోతున్నానని, వివాహానంతరమూ తాను సినిమాలు చేస్తానని ప్రియమణి గతంలోనే వెల్లడించారు. బెంగళూరులో స్థిరపడిన మలయాళీ కుటుంబానికి చెందిన ప్రియమణి 'ఎవరే అతగాడు' చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యారు. 'పెళ్లైన కొత్తలో'తో విజయవంతమైన కథానాయికల జాబితాలో చేరారు. నాగార్జున, బాలకృష్ణ, ఎన్టీఆర్ తదితర అగ్ర కథానాయకుల చిత్రాల్లో నటించింది ప్రియమణి. తమిళం, మళయాళం, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







