భరత్, రుహాని శర్మ, అంగనా రాయ్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'మళ్ళీ ప్రేమిస్తే'
- August 24, 2017
'ప్రేమిస్తే' భరత్, రుహాని శర్మ, అంగనా రాయ్ హీరో, హీరోయిన్లుగా రామా రీల్స్ పతాకంపై జాన్ సుధీర్ పూదోట నిర్మిస్తున్న చిత్రం "మళ్ళీ ప్రేమిస్తే". ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. సెప్టెంబర్ నెలలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ప్రేమిస్తే చిత్రం తర్వాత భరత్ చేస్తున్న ప్రేమ కథా చిత్రం. భరత్ తనను ప్రేమించిన అమ్మాయి మోసం చేస్తే తను పడ్డ స్ట్రగుల్ ని ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు దర్శకుడు. విజయ్ కురకాల సంగీత దర్శకత్వంలో 5 పాటలను ఎంతో చక్కగా రూపుదిద్దారు. ప్రేమిస్తే చిత్రం తర్వాత ఈ 'మళ్ళీ ప్రేమిస్తే' చిత్రం అంత ఘన విజయం సాధిస్తుందని చిత్ర నిర్మాత, దర్శకులు ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
నటీనటులు : 'ప్రేమిస్తే' భరత్, రుహాని శర్మ, అంగనా రాయ్, కాశీ విశ్వనాధ్, సురేఖా వాణి, సన, కోటేశ్వర రావు, 'ఫన్ బకెట్' త్రిశూల్, శివరాం మరియు తదితరులు. సాంకేతిక వర్గం : సంగీతం - విజయ్ కురకాల , సినిమాటోగ్రఫీ - ముజీజ్ మాలిక్, ఎడిటింగ్ - నందమూరి హరిబాబు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ - పి. శేషగిరి రెడ్డి, ఎస్.కె. రఫీ , సహ నిర్మాత - కిరణ్ తనమాల , నిర్మాత - జాన్ సుధీర్ పూదోట, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - రవి భార్గవన్
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







