తెలుగు బిగ్ బాస్ కి పెరుగుతున్న క్రేజీ

- August 24, 2017 , by Maagulf
తెలుగు బిగ్ బాస్ కి పెరుగుతున్న క్రేజీ

ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ షో కు రోజు రోజుకు ప్రేక్షకాదరణ పెరుగుతూ వస్తుంది..ఇక ఎన్టీఆర్ వచ్చే శని , ఆది వారాల్లో అయితే అత్యధిక టి ఆర్పీ రేటింగ్ లు సాధిస్తుంది. ఇక ఈ షో కి మరింత గ్లామర్ తెచ్చేందుకు యాజమాన్యం బాలీవుడ్ తరహాలో ఆలోచిస్తుంది. సినిమా రిలీజ్ టైం లో తమ సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు ఈ షో ను వాడుకుంటున్నారు.
ఈ మధ్యన విడుదలైన రానా.. నేనే రాజు.. నేనే మంత్రి మూవీ ప్రమోషన్ కు పంచకట్టుతో బిగ్ బాస్ హౌస్ లో రానా దర్శనం ఇచ్చి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆనందోబ్రహ్మ మూవీ ప్రమోషన్లో భాగంగా నటి తాప్సీ కూడా బిగ్ బాస్ ఇంటికి వెళ్లి హడావిడి చేసింది. ఇప్పుడు తాజాగా అర్జున్ రెడ్డి చిత్ర హీరో విజయ్ దేవరకొండ బిగ్ బాస్ హౌస్ లో దర్శనం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు వివాదాలతో మీడియా లో బాగా ప్రచారం అవుతున్న ఈ సినిమా , ఇప్పుడు బిగ్ బాస్ షో తో మరింత ప్రచారం కాబోతుంది.
సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన ఈ మూవీ లో థియేటర్ ఆర్టిస్ట్ షాలిని హీరోయిన్ గా పరిచయం అవుతుంది. అలాగే అలనాటి కాంచనతో పాటు విపిఎస్. కళ్యాణ్, జియా శర్మ, ప్రియదర్శి, కమల్ కామరాజు, సంజయ్ స్వరూప్‌ లు ప్రధాన పాత్రలు పోషించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com