రెండవ సారి కూడా హోస్ట్ గా జూనియర్

- August 24, 2017 , by Maagulf
రెండవ సారి కూడా హోస్ట్ గా జూనియర్

భారీ రేటింగ్స్‌తో దూసుకుపోతున్న బిగ్ బాస్ షో బుల్లి తెర ప్రేక్షకుల్ని రంజింప జేస్తుంది.  దీనికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ తనదైన స్టైల్లో ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు.  దీంతో ఈ షోకు ఊహించని రేంజ్‌లో టీఆర్పీ రేటింగ్ కూడా పెరిగిందట. ఇదే హవాని కొనసాగించే ప్రయత్నంలో యాజమాన్యం బిగ్‌ బాస్ సెకండ్ ఇన్నింగ్స్‌కి కూడా ఎన్టీఆర్‌నే హోస్ట్‌గా తీసుకోవాలని నిర్ణయించిందట.  ఈ విషయం పై ఎన్టీఆర్‌ని సంప్రదించగా సెకండ్ సీజన్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com