కువైట్ లో "ప్లాస్టిక్ బియ్యం " లేదు

- August 24, 2017 , by Maagulf
కువైట్ లో

 ' ఇదిగో తోక అంటే ...అదిగో పులి '  అని సెకన్ల వ్యవధిలో పుకార్లను షికార్లు చేయించే  సామాజిక మాధ్యమాలు మన తెలుగు రాష్ట్రాలలో "ప్లాస్టిక్ రైస్" పేరిట ఇటీవల సంచలనం కల్గించిన విషయం మనకు విదితమే.. ప్రస్తుతం కువైట్ లో  ప్లాస్టిక్ బియ్యం కలకలం కల్గిస్తుంది. దీంతో సాక్షాత్తూ  మంత్రిత్వశాఖ అక్కడ రంగంలోనికి దిగింది. బియ్యాన్ని పలు ప్రయోగశాలల నుండి పరీక్షలు జరిపిన తర్వాత ఆ  ఫలితాల ప్రకారం "ప్లాస్టిక్ బియ్యం" ఉత్పత్తులు కువైట్ మార్కెట్ లో లేవని  సురక్షితంగా ఉందని వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. "ప్లాస్టిక్ బియ్యం" కు సంబంధించి సోషల్ నెట్వర్కుల్లో విస్తరించిన పుకార్లు కువైట్ లో జోరుగా వ్యాప్తి చెందిన తర్వాత మంత్రిత్వశాఖ తక్షణమే స్పందించి దేశవ్యాప్తంగా వివిధ దుకాణాల నుండి బియ్యం నమూనాలను సేకరించడం ప్రారంభించింది, ఆహార భద్రత నిర్ధారించడానికి  మార్కెట్లో సురక్షితమైన ఉత్పత్తులను మాత్రమే కలిగి ఉండేలా చూసుకోవడం ద్వారా కువైట్లోకి ప్రవేశపెట్టిన అన్ని ఉత్పత్తులను వినియోగదారులకు చేరుకునే ముందుగానే తనిఖీ చేస్తున్నారు, దిగుమతి చేసుకున్న వివిధ ఆహార ఉత్పత్తులపై అత్యధిక అవసరానికి తగినట్లుగా ఉన్నత స్థాయి ప్రమాణాలు వర్తించే విధంగా చర్యలు తీసుకొనే దేశాలలో కువైట్ ఒకటిగా ఉంది. ఈ తరహా అబద్ధపు ప్రచారాలను  ప్రజలు ఎవరూ  ప్రోత్సహించకూడదని మంత్రిత్వశాఖ  కోరింది. సాంఘిక నెట్వర్కులపై తప్పుడు సమాచారం, వార్తలకు మరియు సమాచారం కోసం ఒక బలమైన మీడియాగా పరిగణించబడుతుంది, ఈ తరహా తప్పుడు వార్తల వలన  సమాజంలో అనవసర భయాందోళన ఏర్పడుతుందని పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com