మిరియాల పొడి, ఒక గ్రాము బెల్లం కలిపి రోజూ ఉదయం తీసుకుంటే...

- August 24, 2017 , by Maagulf
మిరియాల పొడి, ఒక గ్రాము బెల్లం కలిపి రోజూ ఉదయం తీసుకుంటే...

ఎన్నో అనారోగ్య సమస్యలను ఇట్టే నయం చేయగల దినుసులు మన ఇంట్లోనే వున్నాయి. వాటిలో మిరియాలు కూడా వుంటాయి. వీటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో చూద్దాం. శరీరంలో ఏర్పడే నొప్పులు, వాపులు, మోకాళ్ల నొప్పికి మిరియాలు చెక్ పెడుతుంది. గొంతునొప్పి, ఉదర సంబంధిత వ్యాధులను దూరం చేసుకోవాలంటే.. మిరియాల పొడి 50 గ్రాములు తీసుకుని అందులో 600 మి.లీటర్ల నీరు చేర్చి 30 నిమిషాల పాటు వేడి చేయాలి. ఈ నీటిని వడగట్టి రోజూ మూడు పూటలూ 25 మి.లీ చొప్పున తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.  
 
జుట్టు రాలిపోతుంటే మిరియాల పొడి, ఉప్పు, ఉల్లిపాయలు మూడింటిని సరిపాళ్ళతో తీసుకుని బాగా పేస్ట్‌లా చేసుకుని జుట్టు పెరగని చోట రాస్తే జుట్టు పెరుగుతుంది. జ్వరం. జలుబుకు ఒక చిటికెడు మిరియాల పొడి వేసుకుంటే ఉపశమనం లభిస్తుంది. 
 
మిరియాలు ఉదరంలోని వాతాన్ని తొలగించి శరీరానికి ఉష్ణాన్ని ఇవ్వడంతో పాటు వాపులను నయం చేస్తుంది. మిరియాల పొడిని ఉప్పుతో కలిపి బ్రష్ చేసుకుంటే పంటినొప్పి, పళ్ళు పుచ్చిపోవుట, చిగుళ్ల నొప్పి, నోటి దుర్వాసను నిరోధించవచ్చు. అరగ్రాము మిరియాల పొడి, ఒక గ్రాము బెల్లం కలిపి రోజూ ఉదయం సాయంత్రం తీసుకుంటే తలభారం, తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com