జస్టిస్ రూపన్‌వాల కమిషన్ నివేదిక పత్రులను తగలబెట్టిన విద్యార్థులు
- August 25, 2017
రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నాడంటూ జస్టిస్ రూపన్‌వాల కమిషన్ నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. ఆ కాపీలను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు దహనం చేశారు.
గురువారం సాయంత్రం కాలేజీ ఆవరణలో ఓ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఉన్న రోహిత్ వేముల విగ్రహాం వద్ద గుమిగూడిన విద్యార్థులు పత్రులను తగలబెట్టి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. కమిటీ నివేదిక అర్థం పర్థం లేనిదని అంబేద్కర్ స్టూడెంట్స్ అసోషియేషన్ నేత దొంత ప్రశాంత్ విమర్శించారు. కేంద్రం కనుసన్నల్లోనే నివేదికను రూపొందించారని, సాక్ష్యాలు తారుమారు అయ్యాయని ఆయన ఆరోపించారు. హక్కుల కోసం దళితులు పోరాటం చేయాల్సిన పరిస్థితిని ప్రభుత్వాలు కల్పించాయని తెలిపారు. ఇక విద్యార్థులకు సంఘీభావం తెలుపుతూ యూనివర్సిటీ ప్రోఫెసర్ కే లక్ష్మీ నారాయణ నిరసనలో పాల్గొన్నారు. ఓ న్యాయమూర్తి కూడా అబద్ధాల నివేదిక ఇచ్చి ఇస్తాడని తాను ఊహించలేదని ఈసందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.
రోహిత్ సూసైడ్‌కు సస్పెన్షన్ తోపాటు మరియు కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయ, యూనివర్సిటీ అధికారులే కారణమంటూ విద్యార్థులు ఆరోపించటంతో అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అశోక్ కుమార్ రూపన్వాల్ నేతృత్వంలో విచారణ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. గత అక్టోబర్ లోనే నివేదికను రూపొందించి కేంద్ర మానవాభివృద్ధి మంత్రిత్వ శాఖకు సమర్పించింది. అయితే ఈ మధ్యే అధికారికంగా దానిని ప్రకటించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







