ఎక్కిళ్ళు చిటికిలో పోగొట్టొచ్చు..ఇలా

- August 25, 2017 , by Maagulf
ఎక్కిళ్ళు చిటికిలో పోగొట్టొచ్చు..ఇలా

ఎక్కిళ్ళను మనమందరం ఏదో ఒక సంధర్భంలో ఎదుర్కొంటాం. తినే సమయంలో అయితే ఆ బాధ మాటల్లో చెప్పలేము. ఎక్కిళ్ళ సమయంలో తృప్తిగా తినలేము. మనకు వచ్చే ఎక్కిళ్ళు సాధారణమైన ఎక్కిళ్ళయితే సడెన్‌గా షాకింగ్ న్యూస్ చెబితే ఆగిపోతుంది. కారణం మన మెదడుకు ఆ షాకింగ్ న్యూస్ వెళ్ళి మిగిలిన ప్రక్రియ ఆగిపోతుంది. దాంతో పాటు మరో చిట్కా కూడా ఉంది. 
అలాగే సొంటి ఎక్కిళ్ళను బాగా పనిచేస్తుంది. శొంఠిని పొడి చేసి బెల్లంతో కలిపి పీలిస్తే ఎక్కిళ్ళు ఆగిపోతుంది. అంతే కాదు సొంటి, తేనెను కలిపి సేవిస్తే ఎక్కిళ్ళు తగ్గుతుంది. ఎక్కువగా ఎక్కిళ్ళు చిన్న పిల్లలకు వస్తాయి. చిన్నపిల్లలకు ఇలా వస్తే వారిని బోర్లా పడుకోబెట్టి తడితే ఎక్కిళ్ళు తగ్గిపోతాయి. 
అంతేకాదు నీళ్ళలో చక్కెర కలుపుకుని చిన్నపిల్లలకు తాగిస్తే తగ్గిపోతుంది. ఎక్కువగా ఎక్కిళ్ళు వస్తుంటే నల్లతుమ్మచెట్టు ముళ్ళు 20 గ్రాములు నలగ్గొట్టి అరకప్పు మంచినీటిలో వేసి సగం కాషాయం అయ్యే వరకు మరగబెట్టి దించి వడపోసి ఆ కషాయం గోరువెచ్చగా అయిన తరువాత ఒక చెంచా తేనె కలిపి రెగ్యులర్‌గా తాగితే ఎక్కిళ్ళు తగ్గిపోతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com