నిస్వార్ధ సేవా తత్పరురాలు మదర్ థెరిసా
- August 25, 2017
ఆల్బేనియా దేశానికి చెందిన ఆగ్నెస్ గొంక్శే బోజక్షిహ్యు (మదర్ థెరిస్సా) జన్మించి నేటికి 107 సంవత్సరాలు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, సెయింట్ మదర్ థెరిస్సా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం..
" By blood, I am albanian, By citizemship an Indian, By faith Iam a cathalic nun, As to my calling, Iam belong to the world. As to my heart I belong entirely to the heart of Jesus " అని నిజాయితీగా తెలిపిన మదర్‌థెరిస్సా యుగోస్లేవియా దేశంలోని ‘స్కోప్జి’లో 1910 ఆగస్టు 27న జన్మించింది. అసలు పేరు ఆగ్నస్ గోన్షా బొజాక్షు. నన్‌గా(సన్యాసిని)గా మారిన తర్వాత మదర్ థెరిస్సాగా మార్చుకున్నారు. ”ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న” అని ప్రపంచానికంతటికి చాటి చెప్పిన మదర్‌థెరిస్సా తన జీవితకాలాన్ని సేవాకార్యక్రమాలకే అంకితం చేసి ప్రపంచంలో సుమారు 125 దేశాలకుపైగా, 700లకు పైగా సేవా కేంద్రాల ద్వారా పలు సేవా కార్యక్రమాలు ఇప్పటికినీ నిర్వహించబడుటకు ప్రేరణగా నిలిచారు.18 సంవత్సరాల వయస్సులోనే ‘ఆర్డర్ ఆఫ్ టొరెంటో’లో సన్యాసినిగా మారిన థెరిస్సా 1929లో కలకత్తాలోని టొరెంటో స్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా చేరటానికి భారతదేశానికి వాచ్చారు. సెప్టెంబర్ 10, 1946న రైలులో డార్జిలింగ్ వెళ్తున్న సమయంలో కలకత్తాలోని పేద, పీడత బడుగు వర్గాల వారికి సేవ చేయమన్న దైవ వాక్కునకు బద్దురాలై కలకత్తాలోని పలు సేవా కార్యక్రమాలకు అంకితమైపోయింది. ఆమె స్వయంగా కలకత్తాలోని వీధులని కలియ తిరిగి నిస్సహాయంగా పడిఉన్న అనాధలని తన ఆశ్రమానికి తీసుకువచ్చేది. ఆర్డర్ ఆఫ్ లొరెన్టో నుండి బయటకు వచ్చి స్వతంత్రంగా సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. 1948లో మొదటిసారిగా ప్రసిద్దమైన కాళికామాత ఆలయం వద్ద ‘మిషనరీ ఆఫ్ అథారిటీస్’ పేరుతో స్వచ్ఛంధ సంస్థను స్థాపించారు. మొదట ఆమె ప్రారంభించిన సేవా కార్యక్రమాలలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంది. ఆర్థికంగా పలు సమస్యలను ఎదుట నిలిచినా మొక్కవోని ధైర్యంతో ఆమె ముందుకు నడిచిన తీరు ప్రజలందరికీ కనువిప్పు కలిగించింది. ఒక్కొక్కరుగా ఆర్థిక సహయం అందించడం ప్రారంభించారు. హెల్ప్ ఫ్యామిలీ హాస్పిటల్‌లో నర్సింగ్ కోర్సు చేసిన తర్వాత వ్యాధి పీడితులకు కుష్టు రోగ బాధితులకు ప్రేమ నివాస్‌ను ఏర్పాటు చేశారు. అనాథలకు ”నిర్మల శిశు సదన్” ను ఏర్పరిచారు. ”నిర్మల్ హృదయ్”ని స్థాపించి అక్కడికి వచ్చిన వారిని ప్రేమతో ఆదరించేది. నిరాశ్రయులు, వ్యాధిపీడితులు, హెచ్‌ఐవీ వ్యాధి, క్షయా వ్యాధి గ్రస్తులు సంఘంచే బహిష్కరించబడిన వారు వరద బాధితులు ప్రకృతి ప్రకోప గ్రస్తులు, అనాధలు, నిరాశ్రయ బాలలు, ఒకరేమిటీ ఆపన్న హస్తానిన ఆశించిన ప్రతి ఒక్కరిని ఆదరించింది పలు పాఠశా లలు, ఆసుపత్రులు కూడా ఏర్పాటు చేసింది. ధెరిస్సా కార్యక్రమాలు ప్రపంచమంతటా విస్తరించా యి. పలు దేశాలు, స్వచ్చంధ సంస్థలు, అత్యున్నత అవార్డుల నందించారు. భారతదేశం ‘భారతరత్న’ అవార్డునిచ్చి థెరిస్సాన సత్యరించింది జీవితాన్ని మొత్తం పేదసాదల కోసం ధారపోసిన దయాహృదయం ఆమెది. అనాథలు, వ్యాధిగ్రస్తుల కన్నీటిని తుడవడమే ధ్యేయంగా సాగిన ఆమె పయనం.. ఆమె ప్రారంభించిన సేవాసంస్థ అనతికాలంలోనే ఎందరో అభాగ్యులకు ఆసరాగా మారింది.. ఆమె అడుగులే ఆశాదీపాలై ఎందరికో స్ఫూర్తినిచ్చాయి.భరతగడ్డపై ఆపన్నులకు, అన్నార్తులకు ఆమె చేసిన సేవకు వెల కట్టలేం. చిన్నతనం నుండే సేవా తత్పురతతో ఆమె సాగించిన జీవితం ఎందరికో ఆదర్శం.కోల్‌కతా బస్తీ ప్రాంతంలో పేదసాదలు చవిచూస్తున్న కష్టాలు చూసి ఆమె తల్లడిల్లిపోయారు. రోగాలతో బాధపడుతూ.. ఆకలితో పోరాటం చేస్తున్న పిల్లలు, డొక్కలు ఎండిన స్థితిలో ముసలివాళ్లు వీధుల్లో దీనంగా తిరగడం చూసిన ఆమె మనసు ద్రవించింది. చాలా రోజులు దుర్భరభరితమైన ఆ అభాగ్యుల స్థితిగతులే తన కళ్ల ముందు కనిపించేవి. ఎన్నో నిద్రలేని రాత్రుళ్లు గడిపారామె. అందుకే వారికంటూ ఏదైనా చేయాలని భావించారు. ఈ క్రమంలో తన ఉద్యోగాన్ని కూడా వదిలేసి, సేవా మార్గంలో పయనించాలని నిశ్చయించుకున్నారు.
భారత సౌరసత్వం పొంది మిషనరీస్ ఆఫ్ ఛారిటీని కోల్ కత్తాలో స్థాపించి పేదలకు తన సేవలను అందించిన మానవతా వాది. ఆమె పేదలకు, రోగ గ్రస్తులకు, అనాధలకు ఎంతో పరిచర్యలు చేసి అంతర్జాతీయ కీర్తిని పొందారు. మే 24, 1931 లో ఆమె సన్యాసినిగా తన మొదటి మత ప్రతిజ్ఞ చేసినప్పుడు మత ప్రచారకుల సంఘం పోషక సెయింట్ ఐన తెరేసే డిలిసే పేరు మీదుగా తన పేరును తెరెసాగా మార్చుకున్నారు. మే 14, 1937 లో తూర్పు కలకత్తాలోని లోరెటో కాన్వెంటు స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నపుడు తన పవిత్రప్రతిజ్ఞ చేసారు. ఈమె మానవ సేవకు గాను 1979లో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. 1980లో భారత దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను పొందారు. మదర్ థెరీసా మిషనరీస్ అఫ్ ఛారిటీ బాగ విస్తృతమై, ఆమె చనిపోయే నాటికి 123 దేశాలలో 610 సంఘాలను కలిగి, హెచ్ఐవి, ఎయిడ్స్, కుష్టు మరియు క్షయ వ్యాధిగ్రస్తులకు ధర్మశాలలను, గృహాలను, ఆహార కేంద్రాలను, బాలల, కుటుంబ సలహా కార్యక్రమాలను, అనాధ శరణాలయాలను, పాఠశాలలను స్థాపించింది. 1943లో కోల్‌కత్తాలో కరువు సంభవించినపుడు తినడానికి తిండిలేక అల్లాడుతున్న పేద ప్రజలను చూసి ఆమె చలించిపోయారు. ఇంటింటికీ వెళ్లి రొట్టెలు, పాలు అందించి పేదల ఆకలి తీర్చారు. రోగులకు మందులు అందించి తన మానవతను చాటుకున్నారు. కోల్‌కత్తాలో నిర్మల్ హృదయ పేరిట అనాథాశ్రమాన్ని నిర్మించారు. ప్రపంచం మొత్తం పర్యటించి, పేద ప్రజలకు సేవ చేయడానికి ఆమె కంకణం కట్టుకున్నారు. మదర్‌థెరిస్సా శ్రీకాకుళం జిల్లాకు వెళ్ళి అక్కడి లెప్రసీ కాలనీలో పర్యటించి, కుష్టురోగులకు దుప్పట్లు అందజేశారు.శ్వేతాంబరాలను మాత్రమే ధరిస్తూ, నిరాడంబరమైన జీవితాన్ని గడుపుడూ అనాథలు, రోగులకు తనకున్న పరిధిలో సేవ చేయడం ప్రారంభించారు. ఇక ఆ ప్రస్థానం అక్కడితో ఆగిపోలేదు. పేదరికంలో ఉన్న రోగులు, వైద్యం చేయించుకోలేక మృత్యువు బారిన పడటం చూసి ఆమె సహించలేకపోయారు. అలాంటి వారికి ఉచితంగా వైద్య సహాయాన్ని అందించేందుకు, 1948లో మెడికల్ ట్రైనింగ్ తీసుకున్నారు. అప్పుడు ఆమెకు కేవలం 36 యేళ్లు. అనంతరం 1950లో ''మిషనరీస్ ఆఫ్ చారిటీస్ '' పేరిట ఒక సంస్థను స్థాపించారు. ముందుగా చాలా కొద్దిమంది సభ్యులతో, స్వచ్ఛంద కార్యకర్తలతో కలిసి ఆమె స్థాపించిన ఈ సంస్థ కార్యాలయాలు, తర్వాతి కాలంలో 4000 శాఖలుగా విస్తరించాయి. అనాథలకూ, అంధులకూ, పేద రోగస్థులకు ఆశ్రయం కల్పించి, వారికి అండగా ఉండడమే ఈ సంస్థ ఆధ్వర్యంలో నడపబడుతున్న ట్రస్టుల లక్ష్యం. మదర్ తన తుది శ్వాస విడిచే వరకూ పేదసాదల కోసమే బ్రతికారు. అలా శ్రమిస్తూనే, తన ఆఖరి శ్వాస వరకూ తనవారిగా భావించిన అనాథల కోసం పాటుపడుతూ 1997, సెప్టెంబర్ 5న పరమపదించారు. అయినా ఇప్పటికీ కోట్ల మంది ప్రజల మనసుల్లో, చిరస్థాయిగా నిలిచిపోయారు మదర్ థెరిసా... ఈ లోకంలో నేను చేసిన కార్యక్రమాలు ”సింధువులో బిందువంత” అని తెలిపిన సేవా తత్పరురాలు, నిరాడంబర జీవి మానవసేవే మాధవ సేవ అని భావించిన గొప్ప స్వార్ధం లేని సంఘసేవకురాలు. ‘నభూ తో న భవిష్యత్’ అన్నట్లుగా ప్రపంచంలో సుస్థిర స్థానాన్ని పొందిన మదర్‌థెరిస్సా సేవాపథము మనందరికి ఆచరణీయము, అనుసరణీయము, ఎన్నో దేశాలు ఆమెకు స్వచ్ఛందంగా పౌరసత్వాన్ని అందించాయంటే ఆమె సేవలకు మరొక తార్కాణం అవసరం లేదు. ఆమె స్ఫూర్తి మరెందరికో మార్గదర్శమైంది. ఆ మహా త్యాగమూర్తి సేవలను మనసారా ఈ రోజు స్మరించుకుందాం !!
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్‌మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్‌లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









