మయన్మార్‌లోని రఖీనే రాష్ట్రం ఉగ్రదాడుల్లో 89 మంది మృతి

- August 27, 2017 , by Maagulf
మయన్మార్‌లోని రఖీనే రాష్ట్రం ఉగ్రదాడుల్లో 89 మంది మృతి

మయన్మార్‌లోని రఖీనే రాష్ట్రం ఉగ్రదాడులతో దద్దరిల్లుతోంది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి దేశంలోని సరిహద్దు ప్రాంతాలపై తీవ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. ఈ దాడుల్లో 12 మంది భద్రతాదళ అధికారులు, 77 మంది మిలిటెంట్లు మరణించారు. అప్రమత్తమైన ప్రభుత్వం రాష్ట్రమంతటా ఎమర్జెన్సీని ప్రకటించింది. అరాకాన్‌ రోహింగ్యా సాల్వేషన్‌ ఆర్మీ(ఎఆర్‌ఎస్‌ఏ) అనే ఉగ్రవాద సంస్థ దాడులకు పాల్పడినట్లు ఆర్మీ ప్రకటించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com