త్వరలో తగలనున్న కుమారికి జాక్‌పాట్

- August 27, 2017 , by Maagulf
త్వరలో తగలనున్న కుమారికి జాక్‌పాట్

టాలీవుడ్ 'కుమారి' హెబ్బా పటేల్ కెరీర్ ఇప్పుడు ఏమంత గొప్పగా లేదు. 'మిస్టర్' డిజాస్టార్ ఎఫెక్ట్ ఆమె మీద బాగానే పడింది. అందుకే.. హెబ్బా లీడ్ రోల్ చేసిన 'ఏంజెల్' మూవీ రిలీజ్ కావడానికి కష్టాలు పడుతోంది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. హెబ్బాకి కోలీవుడ్ నుండి ఓ క్రేజీ ఆఫర్ వచ్చిందట. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ న్యూ మూవీలో హెబ్బా హీరోయిన్‌గా చేయనుందనే టాక్ వినిపిస్తోంది.
విజయ్ - మురుగదాస్ కాంబోలో ఇంతకుముందు 'తుపాకీ' లాంటి హిట్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ కాంబోలో మరో మూవీ రానుందట. ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారట. అందులో ఓ హీరోయిన్ హెబ్బాని ఓకే చేసేశారని వార్తలొస్తున్నాయి. అదే నిజమైతే.. హెబ్బాకి జాక్‌పాట్ తగిలినట్టే. అయితే ఈ విషయంలో ఫుల్ క్లారిటీ రావాల్సి వుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com