సింగపూర్ లో ఘనంగా వినాయక చతుర్థి వేడుక
- August 27, 2017
సింగపూర్: సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో తెలుగు వారు వినాయక చతుర్థి పండుగ రోజు శుక్రవారం, 25 August నాడు సెరంగూన్ శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయం పి జి పి హాలు నందు వైభవోపేతంగా అత్యంత భక్తి శ్రధ్ధలతో జరుపుకున్నారు.
దాదాపు 1000 మంది దాకా హాజరయిన ఈ పూజా కార్యక్రమాలలో భాగంగా పిల్లలచేత వినాయక ప్రతిమకు జరిపించిన సామూహిక పూజ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. తల్లితండ్రుల సమక్షంలో, 16 సంత్సరాల లోపు గల 100కు పైగా పిల్లల చేత మంథని గ్రామ వాస్తవ్యులు బ్రహ్మశ్రీ ఒజ్జం గణేష్ గారు వినాయకుడి కి స్థానిక సంస్థ GRT Artland వారిచే చేయబడ్డ మట్టి వినాయక ప్రతిమలను పత్రి, పువ్వులు, అక్షింతలు, తాంబూలం, ఉండ్రాళ్ళ నైవేద్యాలతో పూజ జరిపించారు.
పూజానంతరం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు. ప్రముఖ సంగీత విద్వాంసులు, నేపధ్య గాయకులు శ్రీ యేసుదాస్ గారు గారు ఈ కార్యక్రమానికి వచ్చి అందరినీ ఉద్దేశించి కొద్ది నిమిషాలు మాట్లాడటం విశేషం.
ఈ పండగ సందర్బంగా పూజ కార్యక్రమానికి మరియు తెలుగు వారి కోసం ప్రత్యేకంగా పత్రి వితరణకు సహాయపడ్డ తెలుగు మహిళలకు మరియు ఈ కార్యక్రమం వైభవోపేతంగా జరగటానికి కృషి చేసిన సమాజం సభ్యులు సత్య చిర్ల, సత్య సూరిశెట్టి, విజ్జేందర్, రాజశేఖర్, నగేష్ , రామరాజు, శ్రీవిద్య, కిషోర్, జ్యోతీశ్వర్,చైతన్య,ప్రదీప్ మరియు యుగంధర్ లకు సింగపూర్ తెలుగు సమాజం నిర్వాహక కార్యదర్శి మరియు ఈ కార్యక్రమ ప్రతినిధి చల్లా శ్రీప్రదాయ గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సింగపూర్ తెలుగు సమాజం వినాయక చతుర్థి సందర్భంగా జరిపిన ఉచిత పత్రి వితరణ మరియు భావి తరానికి భారతీయ సంస్కృతి చాటి చెప్పే ఉద్దేశ్యంతో జరిపిన పిల్లల పూజా కార్యక్రమానికి విశేష స్పందన రావడంఫై సమాజం అధ్యక్షులు శ్రీ రంగారవి గారు హర్షం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన సమాజం కార్యకర్తలు, వాలంటీర్లకు, పిల్లల పూజకు ప్రోత్సహించిన తల్లి తండ్రులకు, భక్తుల అన్నదానంకి, విగ్రహ మరియు అలంకరణ కి విరాళాలు ఇచ్చిన దాతలకు ఆయన ధన్యవాదాలు తెలియచేసారు.







తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







